GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ అందర్నీ విస్మయపరుస్తోంది. ఓటింగ్ శాతం తగ్గడంపై బీజేపీ అధికారపార్టీపై విమర్శలు తీవ్రం చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌పై విమర్శలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ( GHMC Elections ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినా..చివరికి తీవ్ర నిరాశకు గురి చేశాయి. పోలింగ్ గణనీయంగా తగ్గిపోయింది. 2016లో నమోదైన 46 శాతం కంటే చాలా తక్కువ నమోదు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక పోలింగ్ శాతం తగ్గడంపై ఒకరికొకరు నిందించుకుంటున్నారిప్పుడు. 


ముఖ్యంగా బీజేపీ అధికారపార్టీపై విరుచుకుపడుతోంది. జీహెచ్ఎంసీ ( GHMC ) ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ( TRS Government ) సిగ్గుతో తల దించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్వేషాలు జరుగుతాయని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం వల్లనే ఓటింగ్ శాతం తగ్గిందని కిషన్ రెడ్డి ( Kishan reddy ) ఆరోపించారు. అటు ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం రెండూ కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించాయన్నారు. 


ఇక పోలీసులు, అధికారులైతే ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరపడం ద్వారా ప్రభుత్వం వారిని అవమానించిందన్నారు. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరిపించడం తిరోగమన చర్యగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. పోలింగ్ శాతం తగ్గించేందుకు టీఆర్ఎస్ లేనిపోని అపోహలు సృష్టించిందన్నారు. పోలింగ్ సరళి చూశాక..బీజేపీ ( Bjp ) గెలుస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. 


గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా నమోదైంది. 2016లో 46 శాతం నమోదు కాగా..ఈసారి 40 శాతం దాటే పరిస్థితి లేదు. ఎందుకంటే 5 గంటల వరకూ కేవలం 36 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.


Also read: GHMC Elections 2020: భారీగా తగ్గిన పోలింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం..ఓ విశ్లేషణ