EX MLA Ratnam Joined in BJP: ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని.. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ..నేడు అవినీతిపరులు, మాఫియా చేతిలో బంధీ అయిందన్నారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని.. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లినా బీఆర్ఎస్‌పై వ్యతిరేకత నెలకొందన్నారు. కొన్ని ప్రచార సాధనాలు కావాలని బీజేపీపై వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాహుల్ గాంధీకి రాజకీయాలపై, తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై ఎటువంటి అవగాహన లేదన్నారు. తెలంగాణ పోరాట చరిత్ర గురించి ఏమాత్రం తెలియని రాజకీయ అజ్ఞాని రాహుల్ గాంధీ అంటూ మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు.


బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బి-టీమ్. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి.. కాంగ్రెస్‌లో పనిచేస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది కేసీఆర్. గతంలో అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, పొత్తులు పెట్టుకున్నవి కాంగ్రెస్, బీఆర్ఎస్. గతంలో రిమోట్ కంట్రోల్ గవర్నెన్స్ నడిపించిన ఘనత రాహుల్‌ది. అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్.. కొనే పార్టీ బీఆర్ఎస్. 2018లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు. రాహుల్ గాంధీ..! మీ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయి మంత్రులుగా కొనసాగిస్తున్న దరిద్రపు పార్టీ మీది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఏ-టీమ్ ఎంఐఎం పార్టీ. ఆ పార్టీలను దారుస్సలాం నుంచి అసదుద్దీన్ ఓవైసీ కంట్రోల్ చేస్తున్నాడు.


రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలంగాణ నుంచి ప్రచారం చేసింది ఎవరో మీకు తెలియదా..? మజ్లిస్ పార్టీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ. మా కంఠంలో ప్రాణమున్నంత వరకు బీజేపీ మజ్లిస్ పార్టీతో కలవదు. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ. మాకు అధికారం శాశ్వతం కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం. బీజేపీ ప్రజల టీమ్ తప్ప.. ఏ పార్టీకి టీమ్ కాదు. పచ్చి అవకాశవాదులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని కేటీఆర్ బాహాటంగా ప్రకటించిండు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా, నీతివంతమైన పాలన అందిస్తాం.." అని కిషన్ రెడ్డి తెలిపారు. 


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు  


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook