ఢిల్లీ: సీట్ల లెక్క తేల్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన టీజేఎస్ ఛైర్మన్ కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇక మిగిలిన 10 సీట్లు టీజేఎస్, సీపీఐ పంచుకోవాల్సి ఉంది. సీసీఐ ఐదు సీట్లు తీసుకుంటే ఇక మిగిలియింది 5 సీట్లు కోదండరాం తీసుకోవాల్సి ఉంది. తమకు 15 సీట్లు కావాలని టీజేఎస్ ఎప్పటి నుంచో పట్టుబడుతోంది. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియాలకు టీజేఎస్ తేల్చి చెప్పింది. అయితే దీనికి వారు అంగీకరించకపోవడంతో ఈ పంచాయితి రాహుల్ వద్దే తేల్చుకోవాలని కోదండరాం డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాహుల్ తో భేటీ అయ్యారు.


తమను గౌరవించి తాము కోరిన సీట్లు ఇస్తే సరి ..లేకుంటే ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని కోదండరాం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ భేటీ పై ఉత్కంఠ నెలకొంది. టీజేఎస్ కు ఆ మొత్తంలో సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా..లేదా అన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. అంగీకరించని పక్షంలో కోదండరాం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది కాసేపట్లో తేలనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ -కోదండరాం భేటీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.