Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) చేపట్టిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. సుశీ గ్రూపుల పరిధిలోని వ్యాపార సంస్థలు వందల కోట్ల మొత్తంలో పన్నులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ సోదాల్లో సంస్థల కార్యాలయాల్లోని లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సీజ్ చేసినట్టు సమాచారం.
 
సోమవారం ఉదయం సుమారు 11.30 గంటలకుప్రారంభమైన ఆకస్మిక తనిఖీలు రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రభుత్వానికి లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కనుగొన్నారు. కంపెనీల్లోని ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లలో లభించిన సమాచారం ప్రకారం పలు అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు కూడా జరిగినట్టు వార్తలొస్తున్నాయి.
 
సుశీ గ్రూప్ సంస్థల్లో ఒక సంస్థ సోదాలకు సహకరించనందున సదరు సంస్థ కార్యాలయంలోని బీరువాలో ఉన్న లాకర్‌ను తమ ప్రమేయం లేకుండా తెరవడానికి వీల్లేకుండా సీజ్ చేశారు. సోదాల్లో పాల్గొన్న వాణిజ్య పన్నుల విభాగం అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం సుశీ గ్రూపుల సంస్థలు అన్నీ కలిపి 350 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కంపెనీలకు చెందిన మరో ర్యాక్‌ను వాణిజ్య పన్నుల విభాగం అధికారులు రేపు మంగళవారం తెరవనున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపు తెరవనున్న ర్యాక్ లో లభించే డాక్యుమెంట్లలో మరిన్ని అవకతవకలు వెలుగుచూసినట్టయితే.. ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల రూపంలో ఎగ్గొట్టిన సొమ్ము కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలైన కొద్ది రోజులకే జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రాజకీయంగా రాజగోపాల్ రెడ్డిని ( Komatireddy Rajagopal Reddy )  దెబ్బతీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసిందని బీజేపి నేతలు, రాజగోపాల్ రెడ్డి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇంకెన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయో వేచిచూడాల్సిందే మరి.


Also Read : Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్.. మునుగోడులో తీవ్ర ఉద్రిక్తం


Also Read : CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ


Also Read : PM Modi's Telangana Visit: శభాష్ బండి జీ... తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ఫుల్ దిల్ ఖుష్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook