PM Modi's Telangana Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన బీజేపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే తెలంగాణ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీకి సైతం అంతే సంతృప్తిని ఇచ్చిందంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేటలో అడుగుపెట్టింది మొదలు.. అక్కడ బీజేపి నేతలు, కార్యకర్తలతో స్వాగత సభకు హాజరైంది మొదలు.. రామగుండం ఎరువుల కర్మాగారం సందర్శన, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయడం, ఆ తరువాత జరిగిన భారీ బహిరంగ సభ వరకు జరిగిన అన్ని ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బండి సంజయ్‌కు కితాబివ్వడమే అందుకు నిదర్శనంగా బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
హైదరాబాద్‌కి చేరుకోవడంతోనే బేగంపేటలో స్వాగత సభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. " నేనొక కార్యకర్తను. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశిస్తేనే మీ వద్దకు వచ్చాను '' అని చెప్పి పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజాన్ని నింపారు. అదే సభా వేదికపై నుంచి టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబపాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. బేగంపేట నుంచి రామగుండం బయల్దేరి వెళ్లిన తర్వాత హెలిప్యాడ్ వద్ద స్వాగతం చెప్పేందుకు వచ్చిన బండి సంజయ్‌ను దగ్గరకు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. 'సంజయ్ బండిజీ... శబ్భాష్..' అంటూ భుజం తట్టి అభినందించారు. ముఖ్యంగా ప్రధాని సభకు తరలి వచ్చిన జనం చూసి ఆయన ఎంతో ఆనందపడ్డారని.. అది ఆయన మాటల్లోనే స్పష్టం అవుతోందని తెలంగాణ బీజేపి నేతలు చెబుతున్నారు.
తెలంగాణ వేగవంతమైన అభివృద్ధి కోసం మాకు మీ ఆశీర్వాదం కావాలి. ఈ సభకు హాజరైన జనాలను చూస్తే హైదరాబాద్ లో కొందరికి నిద్ర పట్టదు.
-పీఎం శ్రీ నరేంద్ర మోదీ#TelanganaThanksModiJi pic.twitter.com/7dP7jAtjGY— BJP Telangana (@BJP4Telangana) November 12, 2022
హెలీప్యాడ్ నుంచి రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమలో పర్యటించడం, అక్కడి నుండి భారీ బహిరంగ సభకు వచ్చే ముందు... సభలో మాట్లాడిన తరువాత ఇలా మోదీ పలు సందర్భాల్లో బండి సంజయ్ భుజం తడుతూ " బండి జీ.. ఏర్పాట్లు చాలా బాగున్నాయి" అంటూ అభినందించడం చూస్తోంటే ప్రధాని మోదీకి తెలంగాణ పర్యటన ఎంత సంతృప్తికరంగా అనిపించిందో ఇట్టే అర్థమవుతోందని తెలంగాణ బీజేపి వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన తీరును కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ.. బీజేపి ఫైటింగ్ స్పిరిట్‌ని మెచ్చుకున్నారు. తెలంగాణలో బీజేపి బలపడుతోందని.. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపి నేతల పని తీరుకు ఇది ప్రధాని మోదీ ( PM Modi ) ఇచ్చిన గుర్తింపుగా భావించవచ్చని బీజేపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read : KCR VS MODI: జగన్ అలా.. కేసీఆర్ ఇలా! తెలంగాణకు లాభమా..నష్టమా?
Also Read : Bandi Sanjay: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌కి బండి సంజయ్ సూటి ప్రశ్నలు
Also Read : TRS MLAs Poaching Case: ఇందులో గవర్నర్‌కి ఏం సంబంధం.. బీజేపి నేతలకు మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం