Komatireddy Rajagopal Reddy Pressmeet: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఏ వ్యాపారం చేయకున్నా... రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టీ మరీ పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నాడని.. అదే పదవిని అడ్డం పెట్టుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దోచుకోవాలని చూస్తున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బలి దేవత అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ నిందను మరొకరిపై వేస్తున్నాడన్నారు. ఏ వ్యాపారం లేకుండా కేవలం రాజకీయాలపైనే బ్లాక్ మెయిల్ చేసి కోట్లకొద్ది ఆస్తులు సంపాదించాడనే విషయం అందరికీ తెలుసు అని రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగు పార్టీలు మారి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకొకరు పార్టీ మారడం గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. తాను రేవంత్ రెడ్డి చేపట్టిన పిసిసి చీఫ్ పదవికి మద్దతు ఇవ్వలేదని.. అందుకే తనపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని రాజగోపాల్ మండిపడ్డారు. తాను వ్యాపారాలు చేసినా.. నిజాయితీగానే వ్యాపారం చేశానని.. అది తప్పెలా అవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 


అంతకంటే ముందు అసలేం జరిగిందంటే..


ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే పరోక్షంగా ఆయనపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్లను తీసుకొచ్చి వారి నేతృత్వంలో పనిచేయమంటే తమకు ఆత్మగౌరవం లేదా అని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి.. పార్టీలో తమకే ఆత్మగౌరవం లేకుంటే ఇక ప్రజల ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడాలో అర్థం కావడం లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి నిర్ణయించుకున్న తర్వాతే రాజీనామాకు సిద్ధపడ్డానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యాపార అవసరాల కోసం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ఇచ్చిన కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ మారుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా విసిరిన ఎంగిలి మెతుకుల కోసమే పార్టీ మారాడే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కాదని రాజగోపాల్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy ) మరోసారి ఈ ప్రకటన విడుదల చేశారు.


Also Read : Revanth Reddy Live: మోదీ, అమిత్ షా విసిరిన ఎంగిలి మెతుకుల కోసమే.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై రేవంత్ రెడ్డి


Also Read : Komatireddy Rajagopal Reddy resigned: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. మునుగోడు ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ లైవ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook