Komatireddy Rajagopal Reddy resigned: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదా అనే ప్రశ్నకు జవాబు లభించింది. ఇదే విషయమై తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిందని స్వయంగా ఆయనే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చాలామంది చాలా రకాలుగా తప్పుదోవ పట్టించి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఇకనైనా ఈ అంశంపై తన అభిప్రాయం ఏంటో చెప్పాలని అనిపించింది. అందుకే ఇలా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో చర్చించిన అనంతరం ఇలా మీ ముందుకు వచ్చానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. స్పీకర్ సమయం తీసుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రం అందజేస్తానని రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నానని, మీడియా ద్వారా సైతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశానని.. అయినా ఫలితం లేకపోయిందని అన్నారు. గత మూడేళ్లుగా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక తప్పయితే.. ప్రజా సమస్యల కోసం కృషి చేయకపోవడం మరో తప్పని.. ఇవన్నీ చూశాక చాలా బాధనిపించింది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy resignation) ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..
Also Read : Yadadri Temple Protocol issue: యాదాద్రిలో కేంద్రమంత్రులకు అవమానం.. కేసీఆర్ తో అట్లుంటది మరీ!
Also Read : CM KCR: ముందస్తుకే కేసీఆర్ మొగ్గు.. ఈనెలలోనే అసెంబ్లీ రద్దు? అంతా పీకే డైరెక్షన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Komatireddy Rajagopal Reddy resigned: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. మునుగోడు ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ లైవ్