Komatireddy Rajagopal Reddy: కేసిఆర్ కుటుంబ  దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయమన్నారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..ఈ పాలన మరో ఐదు వారాల్లో నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలో  ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా  ఎదిగిన బిజెపి ఎన్నికల వేళ రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారని, అందుకే తన కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా  వ్యవహరించాలని బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో అవినీతి అరాచక, నియంతృత్వ, కుటుంబ  పాలనకు చరమగీతం పాడేందుకే 15 నెలల క్రితం మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి చేరాడని తెలిపారు. అందుకే ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌ పార్టీపై పోటీ చేసి ఓడించినంత పని చేశారన్నారు. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 మంది ఎమ్మెల్యేలను దింపి.. వందల కోట్లు ఖర్చు చేసిన స్వల్ప తేడాతో ఓడిపోయాన్నారు. 


Also Read: Bhagavanth Kesari: కాజల్ కి ఆ పాత్ర వేస్ట్ అని ముందే చెప్పాను అంటున్న అనిల్ రావిపూడి


అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయన్నారు. అయితే అధికారిక బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేకపోవడంతో..ఆ స్థానంలోకి కాంగ్రెస్‌ వచ్చిందన్నారు. పదేళ్ల  కెసిఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పిందని..అధికార మార్పు కోరుకుంటున్న ప్రజలు తీసుకున్న ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకుంటున్నానన్నారు.


మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించినమ బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనను ముందుండి ప్రోత్సహించి నడిపించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు రుణపడి ఉంటానున్నాడు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారబోతున్నట్లు తెలిపారు. 


గతంలో కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరినా..ఈ రోజు బిజెపి నుంచి కాంగ్రెస్‌లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే అన్నారు. కేసిఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తన మొదటి లక్ష్యమన్నారు. తను ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డారన్నారు. నియంత పాలనను  అంతమొందించేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నబోతున్నట్లు తెలిపారు.


Also Read: Bhagavanth Kesari: కాజల్ కి ఆ పాత్ర వేస్ట్ అని ముందే చెప్పాను అంటున్న అనిల్ రావిపూడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook