Komatireddy Venkat Reddy: నల్గొండ: తెలంగాణను పోరాడి సాధించుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాల కోసం కాగా ఇప్పటికీ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నీళ్లను జగన్ కు దోచిపెట్టాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికలకు ముందు కుర్చీ వేసుకుని కూర్చుని మరీ ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తిచేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకు సొరంగం పనులు పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ మాటలతో మాయ చేసే మాయల మరాఠీ అని చేతల్లో శూన్యం అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం రాత్రి నల్గొండలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. జనం కూడా రెండుసార్లు మోసపోయారు.. ఇక మూడోసారి మోసపోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. 


దళిత బంధు పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని కేసీఆర్ అన్నారు. అలాంటప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఈ సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోరు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. దళితులను దోచుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేవలం హెచ్చరించి వదిలేస్తారా అని నిలదీశారు. ఒకప్పుడు స్కూటర్‌పై తిరిగిన మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎలా కొన్నారో సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగారంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎలా కట్టిండో చెప్పాలని నిలదీశారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy Nalgonda Meeting: ఇది నల్గొండ బిడ్డలకే అవమానం.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్


మంత్రి నిరంజన్ రెడ్డికి 400 ఎకరాలు ఎలా వచ్చాయి..
ఎవరేం మాట్లాడినా పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ మంత్రి నిరంజన్ రెడ్డికి సిగ్గు లేకుండా చెబుతున్నారు. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని.. రైతులు సుభిక్షంగా ఉన్నారని ఔరంగాబాద్, నాందేడ్ కి వెళ్లి చెప్పుకోవడం కాదు... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్లి చూడు.. రైతు ప్రభుత్వం అంటే ఏంటో తెలుస్తుంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.


ఇది కూడా చదవండి : Jr NTR TDP: నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK