Komatireddy Venkat Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తనను కాదని మరో ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించడంతో ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు. నేడు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అర్హతలు ఉండి పదవి రాకుంటే చాలా బాధగా ఉంటుందన్నారు. అంత మాత్రాన పార్టీ మారే అవకాశం లేదని పేర్కొన్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నా టీపీసీసీ ఛీఫ్ దక్కకపోవడంలో ఆవేదనతో తాను మాట్లాడానని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. పార్టీ మారడం లేదని, కాంగ్రెస్‌లోనే తన పయనం కొనసాగుతుందన్నారు. గ్రూపు రాజకీయాలు చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (komatireddy venkat reddy) అభిప్రాయపడ్డారు.


Also Read: Kishan Reddy: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ, కిషన్ రెడ్డికి ప్రమోషన్


ఉత్తమ్ కుమార్ నుంచి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను జులై 7న రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో స్వీకరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సోదరుల కదలికలపై తెలంగాణలో చర్చ జరిగింది. ఈ క్రమంలో నేడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వైఖరి ఏంటో తెలియజేశారు. ఇతర పార్టీల నుంచి తనకు పలుమార్లు ఆహ్వానాలు అందాయని, అయినా కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందన్నారు.


Also Read: TPCC Chief రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే Danam Nagender ఫైర్, చివరిశ్వాస వరకు కేసీఆర్‌తోనని స్పష్టం


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవికి సైతం తాను రాజీనామా చేశానని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని నేడు పదవి కోసం పార్టీ ఎందుకు మారతానన్నారు. భువనగిరి ప్రజలు తనను రూపాయి ఖర్చు లేకుండా గెలిపించారని చెప్పారు. గాంధీ భవన్‌లో కూర్చోకుండా ప్రజల మధ్యన తిరిగితేనే ఎన్నికల్లో గెలవగలమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో పార్టీ సీనియర్ నేతలను బుజ్జగించే ప్రసక్తేలేదని కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం పరిస్థితిని అర్థం చేసుకుని నడుచుకోవాలని భావిస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook