Konda Film: వరంగల్ జిల్లా పేరు చెప్పగానే రాజకీయంగా కొండా దంపతులు గుర్తుకు వస్తారు. వరంగల్ రాజకీయాలతో అంతగా వాళ్లకు అనుబంధం ఉంది. వరంగల్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు కొండా మురళీ- సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు పదేళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కారు పార్టీ నుంచి సురేఖ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో సురేఖ ఓడిపోయారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కొండా దంపతులు.. కొన్ని రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత దూకుడు పెంచారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కొండా దంపతుల చరిత్రతో సినిమా తీయడంతో..  కొండా దంపతులు మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఎన్నికల్లో కొండా కూతురు పోటీ చేస్తుందనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. కొండా కుటుంబ రాజకీయ వారసురాలిగా సుస్మితా పటేల్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. కూతురు పొలిటికల్ ఎంట్రీపై కొండా దంపతులు క్లారిటీ ఇవ్వలేదు. కాని వరంగల్ వేదికగా జరిగిన ఈవెంట్ తో సుస్మితా రెడ్డి రాజకీయ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. రాంగోపాల్ వర్మ నిర్మించిన `కొండా` చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హనుమకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక రాజకీయంగా సంచలనమైంది. కొండా సినిమా వేడుక సాక్షిగా కొండా దంపతుల కూతురు కొండా సుస్మితా పటేల్ హల్చల్ చేశారు. పంచ్ డైలాగులు విసిరారు. కొండాకు చిరకాల ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు సుస్మితా పటేల్. సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్దండులను మరిపించేలా తీన్మార్ డైలాగులు పేల్చారు సుస్మితా పటేల్. ఎర్రబెల్లి ఇక కాస్కో అంటూ సవాల్ చేశారు.



మొదటి నుంచి భయంతోనే ఎర్రబెల్లి బతుకుతున్నాడన్న సుస్మితా.. ఇకపైనా భయంతోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికలు వస్తున్నాయి కదా.. చూస్కుందాం అంటూ హెచ్చరించారు. ఏం దయాకర్ రావు.. సాయి పల్లవి వస్తే రెడ్ కార్పెట్ వేశావట.. మరీ మా నేత వస్తే ఎందుకు భయపడ్డావ్ అంటూ నిలదీశారు. కొండా సినిమా వేడుకకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకుండా అడ్డుకున్నారని ఎర్రబెల్లిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పులి.. పులి పేరు చెబితేనే ఎర్రబెల్లి వణికిపోతున్నాడంటూ సెటైర్లు వేశారు. కొండా సినిమాతో ఎర్రబెల్లికి భయం పట్టుకుందని.. డైపర్లు ఆర్డర్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని చెప్పారు. ఎర్రబెల్లికి డైపర్లు పంపింద్దామా అంటూ కొండా అనుచరులను ప్రశ్నిస్తూ.. వేదికపై రచ్చ రచ్చ చేశారు కొండా సుస్మితా పటేల్. వరంగల్ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయని కామెంట్ చేశారు.


కొండా సినిమా వేడుకలో సుస్మితా పటేల్ చేసిన ప్రసంగం వరంగల్ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి టార్గెట్ గా సుస్మిత చేసిన కామెంట్లను కొండా వర్గీయులు వైరల్ చేస్తున్నారు. తీన్మార్ డైలాగులతో అదరగొట్టిన సుస్మితా.. వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని చెబుతున్నారు. సుస్మితా పటేల్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఎర్రబెల్లిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ .. తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నానని సుస్మిత సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పదేపదే పొగడటం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తనకు తిరుగులేకుండా చూసుకునే యోచనలో కొండా డాటర్ ఉందంటున్నారు. సుస్మితా పటేల్ కు రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయంటున్నారు. సుస్మితా ఎంట్రీతో వరంగల్ రాజకీయాలు 20 ఏళ్ల క్రితంలా మళ్లీ హాట్ హాట్ గా సాగనున్నాయనే టాక్ జనాల నుంచి వస్తోంది.


Read also: Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. మరో 931 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్


Read also: KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook