Naga Chaitanya Divorce Issue: రాజకీయాల్లో హుందాతనం లేకుండా ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని లాగేసి మంత్రి కొండా సురేఖ అత్యంత దారుణానికి తెగబడ్డారు. సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని సురేఖ రాజకీయాల్లోకి లాగడం తీవ్ర దుమారం రేపుతోంది. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజే ఒక ఆడపిల్ల జీవితంతో రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేయడం విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల నాయకులపై రాజకీయంగా విమర్శించే శక్తి లేక సినీ పరిశ్రమకు చెందిన వారిని రాజకీయాల్లోకి లాగడం వివాదాస్పదంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: హైడ్రాను రేవంత్‌ కాదు రాహుల్‌ గాంధీని నడిపిస్తున్నాడు: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు


 


ఏం జరిగింది?
కొన్ని రోజులుగా కొండా సురేఖ రెచ్చిపోతున్నారు. గతంలో ఆమె బూతులతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై బూతులతో ఆమె విరుచుకుపడ్డారు. నాడు ఉద్యమ నాయకులుగా ఉన్న కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండ రామ్‌పై రాయలేని భాషలో మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు సురేఖ తన పాత నైజాన్ని బయటపెడుతున్నారు. రెండు రోజుల కిందట ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దారుణ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా బుధవారం కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ


 


సినీ హీరోయిన్ల వ్యక్తిగత జీవితం
రాజకీయ నాయకురాలిగా హుందాతనం ప్రదర్శించాల్సిన కొండా సురేఖ స్థాయి మించి ప్రవర్తిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ తప్పటడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టి విమర్శలు చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత జీవితంలో ఏర్పడిన గడ్డు కాలాన్ని గుర్తు చేసి కేటీఆర్‌కు ఆమె లింక్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. కొండా సురేఖ మరింత రెచ్చిపోయి మాట్లాడుతూ హీరోయిన్ల జీవితాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ కొందరు హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేసి వారిని సినీ పరిశ్రమ నుంచి దూరం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఒక మహిళగా.. మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇతర మహిళల జీవితాన్ని ప్రస్తావించడం నీచంగా పేర్కొంటున్నారు.


రాజకీయ కుట్రలో భాగంగా కొండా సురేఖ ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేసుకోవాలి కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలు తెరపైకి తీసుకురావడం, దానికి తోడు మహిళల జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.