Konda Vishweshwar Reddy supports Eetela Rajender: హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు మంత్రి కేటీఆర్‌‌కు లేవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమ‌వారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితు, పలువురు నేతల తీరుతెన్నులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ అంశమే ప్రముఖంగా ప్రస్తావనకొస్తున్న నేపథ్యంలో ఈటల గురించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఈటల రాజేందర్, మంత్రి హరీష్‌ రావులకు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత కొంతమేరకు మళ్లీ ఆ అర్హతలు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా ఉన్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు లేవన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy about Minister KTR)
మంత్రి కేటీఆర్ గురించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తేనని, అలాగని ముఖ్యమంత్రి స్థానానికి మాత్రం తగిన వ్యక్తి కాదని అన్నారు. తనకు టీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవ్వరితోనూ ఎలాంటి విభేధాలు లేవని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేకపోయింది కనుకే అందులోంచి బయటకు వచ్చేశానని పేర్కొన్నారు. ఇదే విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్కం ఠాకూర్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డికి కూడా చెప్పానని అన్నారు.


Also read : Telangana COVID-19 cases: తెలంగాణలో 24 గంటల్లో 4,826 కరోనా కేసులు, 32 మంది మృతి


రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే ( Konda Vishweshwar Reddy about Revanth Reddy):
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇస్తే తిరిగి ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదని ఇచ్చినా సరే తాను మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి రాలేనని అన్నారు. ఒకవేళ రేవంత్‌ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఆయన పార్టీని పైకి తీసుకురాలేరని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వాళ్లను దూరం చేసుకుని, ద్రోహులను అక్కున చేర్చుకుంటున్నారని చెబుతూ ఒకవేళ కేసీఆర్ స్వయంగా మంచి దారిలో నడిస్తే తాను ఆయనకే మద్దతు ఇస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) స్పష్టంచేశారు.


Also read : తెలంగాణ Lockdown పై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook