Konda Vishweshwar Reddy meets Eetela Rajender: మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మేడ్చల్‌లోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఈటలతో భేటీ అయి ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈటలకు ఇటీవల ఎదురైన పరిణామాలపై, ప్రభుత్వం నుంచి ఎదురైన ఇబ్బందుల గురించి ఆయననే స్వయంగా అడిగి తెలుసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఈటలకు తన సానుభూతిని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండటం వల్లే తాను కూడా పార్టీలో ఇమడలేక బయటకు రావాల్సి వచ్చిందని ఈటల రాజేందర్‌కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం.
ఈటల రాజేందర్‌పై ఆరోపణలు ఎదురైనప్పటి నుంచే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి ఉన్న సీనియర్ నేతల్లో తాను గౌరవించే వారిలో ఈటల రాజేందర్ ఒకరు అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారా అనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి భేటీ అవడానికి కారణం కూడా అదే అయ్యుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Also read : Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ విధించడం లేదు: సీఎం కేసీఆర్
2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత 2018 ఎన్నికల కంటే ముందుగానే టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో అదే చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండటం చూసి ఆయన బీజేపీలో చేరుతారా అనే ప్రచారం కూడా జరిగింది కానీ అలాంటిదేమీ అవలేదు.
ఇదిలావుండగా ఇంకా ఏ పార్టీ వైపు మొగ్గుచూపని కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) సొంతంగానే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని, సరైన సమయం కోసం వేచిచూస్తున్న కొండాకు తాజాగా ఈటల రాజేందర్ అంశం (Eetala Rajender issue) కలిసొచ్చిందని, అందుకే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాస్ లీడర్ అయిన ఈటల రాజేందర్‌తో కలిసి పనిచేసే ఉద్దేశంతోనే వచ్చి ఆయన్ని కలిసుంటారనే (Reason behind Konda Vishweshwar Reddy's meeting with Eetela Rajender) టాక్ వినిపిస్తోంది.
Also read: Eetela Rajender: ఈటల రాజేందర్‌కు ఊరట.. మెదక్ కలెక్టర్ రిపోర్టును తప్పుపట్టిన High court
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook