KTR Notice: పేరుకు మీడియా కానీ చేసే ప్రచారం.. అసత్యాల ప్రసారంతో ప్రముఖుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రధాన మీడియా సంస్థలతోపాటు యూట్యూబ్‌ చానల్స్‌ అడ్డగోలుగా చేస్తున్న తప్పుడు కథనాలు, దుష్ప్రచారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ యుద్ధం ప్రకటించారు. ఇకపై ఆయా సంస్థలతో న్యాయ పోరాటంతోపాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆ తెల్లారే ఓ కీలకమైన కేసు విషయంలో తమపై అసత్య ప్రచారం చేసిన 16 మీడియా సంస్థలకు కేటీఆర్‌ నోటీసులు పంపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: యూట్యూబ్ ఛానళ్లపై కేటీఆర్‌ యుద్ధం.. ఇక ఆయా ఛానళ్ల వారికి చుక్కలే


 


హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ హొటల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్రగ్స్ బయటపడిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంలో బీజేపీ నాయకుడి కుమారుడితోపాటు ఓ వ్యాపారవేత్త తనయుడు, మరో యువకుడిని కొకైన్‌తోపాటు అరెస్ట్‌ చేశారు. అయితే డ్రగ్స్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ బామ్మర్ది పాకాల రాజేంద్రప్రసాద్‌ ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరిగింది. ఈ డ్రగ్స్‌ దందాలో ప్రధాన ప్రధాన సూత్రధారి రాజేంద్రప్రసాద్‌ అని మీడియా సంస్థలు తప్పుడు ప్రసారం చేశాయి. బామ్మర్ది ద్వారా కేటీఆర్‌ మొత్తం డ్రగ్స్‌ వ్యాపారం నడిపిస్తున్నాడనే అసత్య వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించాయి. మొదటి నుంచి ఈ వార్తలను ఖండిస్తున్న కేటీఆర్‌, అతడి అనుచరులు తాజాగా న్యాయ పోరాటం మొదలుపెట్టారు.

Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..


 


తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు నోటీసులు పంపారు. అసత్య కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని పాకాల రాజేంద్రప్రసాద్‌ నోటీసుల్లో తెలిపారు. ఒక్కో మీడియా సంస్థపై రూ.10 కోట్ల దావా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. తప్పుడు కథనాలను వారంలోగా ఆన్‌లైన్‌లో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆయా మీడియాసంస్థలతోపాటు గూగుల్‌ ఇండియా, యూట్యూబ్‌ సంస్థలకు రాజేంద్రప్రసాద్‌ నోటీసులు పంపారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు నష్టం కలిగించారని, తాను అనుభవించిన మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో డిమాండ్‌ చేశారు. తనకు ఆయా సంస్థలు క్షమాపణ కూడా చెప్పాలని కోరారు. ఆ రాడిసన్‌ బ్లూలో దొరికిన డ్రగ్స్‌ వ్యవహారంలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి