KTR Padayatra: ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేసేది అక్కడి నుంచే!
KT Rama Rao Padayatra Place And Date: రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే దానికి కార్యరూపం దాల్చనున్నారంట. అయితే ఆయన చేపట్టే పాదయాత్ర అక్కడి నుంచే
KT Rama Rao Padayatra: తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హామీల అమలులో రేవంత్ రెడ్డి విఫలమవడం.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం జరుగుతుండడం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుండడంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వారికి అండదండగా నిలుస్తోంది. రోజురోజుకు గులాబీ పార్టీ బలోపేతమవుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రజలకు పార్టీ దూరమైందనే వార్తల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు. త్వరలోనే పాదయాత్ర చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కేటీఆర్ పాదయాత్రకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రజలు కూడా స్వాగతిస్తున్నారనే అభిప్రాయం రావడంతో కేటీఆర్ పాదయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఒక జిల్లా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
Also Read: Arvind: త్వరలో రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కి పడేస్తారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తీవ్ర ప్రజాగ్రహం పొందుతోంది. వాటిలో రైతు బంధు కూడా ఒకటి. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు సహాయాన్ని పెంచి ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీన నెరవేర్చలేదు. రెండు పంటకాలాలు వెళ్లిపోయినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాదయాత్ర చేపడుతున్నారు. ఈనెల 12వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు చేపట్టనున్న ఈ పాదయాత్రలో కేటీఆర్ పాలు పంచుకుంటారని సమాచారం.
Also Read: Aleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో ఉండడు. 2025లో తెలంగాణకు కొత్త సీఎం?
రైతు రుణమాఫీ, రైతు భరోసా (రైతుబంధు) అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేపడుతున్న పాదయాత్ర నుంచే కేటీఆర్ తన పాదయాత్రకు శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కంచుకోట లాంటిది. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కరీంనగర్ నుంచి చేపడుతుంది. ఇప్పుడు తన రాజకీయ చరిత్రలో తొలిసారి కేటీఆర్ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రను కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించే అంశాన్ని ప్రస్తుతం పార్టీ పరిశీలిస్తోందని సమాచారం. అక్కడి నుంచి అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలుపుతారని గులాబీ పార్టీ భావిస్తోంది. త్వరలోనే పాదయాత్రపై పార్టీ కీలక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.