Dharmapuri Arvind: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కి పడేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చాయని.. స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్ అని మండిపడ్డారు.
Also Read: Aleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో ఉండడు. 2025లో తెలంగాణకు కొత్త సీఎం?
నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ పార్టీ, ఎంఐఎంపై తీవ్ర ఆరోపణలతో విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా స్పందించారు. 'కుల గణన పకడ్బందీగా చేసి వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి' అని సూచించారు. 'ఎన్నికల హామీలు నెరవేర్చడంలో తెలంగాణలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలపై ఒట్లు వేసి గట్టిమీద పెట్టేశాడు' అని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Bandi Sanjay: కేటీఆర్, రేవంత్ రెడ్డి చేయాల్సింది పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర
'కాంగ్రెస్ పార్టీని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతాళానికి తొక్కడం ఖాయం. రేవంత్ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగింది' అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. 'కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చింది. ఆ పారటీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన వాఖ్యలు నిదర్శనం. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖర్గే చదవలేదా? చదవకుండానే ఆమోదించారా?' అని ప్రశ్నించారు.
'రేవంత్ ప్రభుత్వం కనీసం జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. రూ.500 బోనస్ ఏమైంది?' అని ఎంపీ అర్వింద్ నిలదీశారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీక మద్దతు ఇచ్చిన రైతులను రేవంత్ సర్కార్ నిండా ముంచింది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి' అని కోరారు. తమపై విమర్శిస్తున్న ఏఐఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ వ్యాధి అని విమర్శించారు. 'వక్ఫ్ చట్టంలో అతి పెద్ద తప్పిదాలు ఉన్నాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న జడ్జిలు మొత్తం ముస్లింలే. వారు చెప్పిందే ఫైనల్' అని వివరించారు.
'వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి' అని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆమోదాలకు దగ్గట్టు ఓవైసీ ఉండాలి.. లేకుంటే దేశం వదిలిపెట్టి వెళ్లిపోండి అని సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలోకి ఇప్పటివరకు హైడ్రా బుల్డోజర్లు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఎంఐఎం పార్టీకి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని తెలిపారు. రానున్న ఏ ఎన్నికలు అయినా గెలిచేది తమ పార్టీనేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్!
సీఎం మార్చే ఆలోచనలో కాంగ్రెస్!#BJP4Telangana pic.twitter.com/B8EW7EOcHY
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 3, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook