KT Rama Rao Case: ఫార్ములా ఈ కారు కేసులో క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసిన వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ట్వీట్‌ చేశారు. తన నోరును ఎవరూ మూయించలేరు అని ప్రకటించారు. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని తెలిపారు. ఈ అబద్ధాలు తనను దెబ్బతీయలేవు అని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి వైఫల్యాలపై నిలదీయకుండా ఉండలేమని స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్


ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. కోర్టు కేసు కొట్టివేయడంతో ఇక అతడి అరెస్ట్‌ తప్పదని సర్వత్రా చర్చ జరుగుతోంది. కేటీఆర్‌ తప్పదంటూ వార్తలు వస్తుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆందోళన నెలకొంది. అరెస్ట్‌ తప్పదా? అని ప్రచారం జరుగుతున్న వేళ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు.

Also Read: Rajinikanth: కంట్రోల్‌ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు


నా నోరు మూయించలేరు
'నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బ తీయలేవు' అని కేటీఆర్‌ ప్రకటించారు. 'ఆ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 'న్యాయవ్యవస్థను గౌరవిస్తా. న్యాయం గెలుస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది' అంటూ కేటీఆర్‌ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.


బీఆర్‌ఎస్‌లో భయాందోళన
న్యాయస్థానంలో ఎదురుదెబ్బల నేపథ్యంలో కేటీఆర్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఏసీబీ కూడా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా న్యాయవాదులతో కాకుండా ఒంటరిగా విచారణకు రావాలని సూచించింది. ఈ విచారణలతో కేటీఆర్‌ అభిమానులతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీలో భయాందోళన నెలకొంది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.