Lagacharla Farmers: తమ భూములు పోతున్నాయనే భయంతో ఉన్న లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కక్ష గట్టిందని.. అక్కడి గ్రామాలు, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వారిని సమిధలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా అంగీకరిస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ethanol Industry: రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో డేంజరస్ కంపెనీ.. ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం


కొడంగల్‌ నియోజకవర్గం లగచర్ల బాధిత రైతులను సంగారెడ్డి జైలులో శుక్రవారం కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పర్యటన రోజు జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పోరాటం.. దాడి విషయాలు ఆరా తీశారు. పోలీసులు వ్యవహార శైలిని ప్రత్యేకంగా తెలుసుకున్నారు. మీకు అండగా తాము ఉంటామని జైల్లో ఉన్న రైతులకు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం భరోసా ఇచ్చింది.

Also Read: Kishan Reddy: రేవంత్‌ రెడ్డి ఛాలెంజ్‌కు కిషన్‌ రెడ్డి సై.. రేపు మూసీ ఒడ్డున నిద్ర.. భోజనం


'లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడు' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'జైల్లో 16 మంది రైతుల బాధ చెప్పలేని విధంగా ఉంది. వారిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. కులగణనలోనూ ఆ ఉద్యోగి పాల్గొనగా సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు' అని కేటీఆర్‌ వివరించారు.


'అరెస్టయిన రైతుల్లో ఒక తమ్ముడు వనపర్తిలో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు' సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వెల్లడించారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారని చెప్పారు. 'దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతుండగా.. పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్‌లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడు' అని కేటీఆర్‌ చెప్పారు.


'సీఎం అన్న అనే ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యంగేతర శక్తి గా మారాడు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లేలా రారాజుగా వ్యవహరిస్తున్నాడు. కొడంగల్‌లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు' అని కేటీఆర్‌ వివరించారు. 'నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు' అని వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter