KTR: ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన
KT Rama Rao Padayatra Very Soon In Telangana Wide: తమ పార్టీ బలోపేతం.. కార్యకర్తల అభీష్టం మేరకు తాను పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
KT Rama Rao Padayatra: రాజకీయంగా తీవ్ర ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటున్న వేళ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీపావళి పండుగ రోజు గురువారం సాయంత్రం పూట 'ఎక్స్'లో 'ఆస్క్ కేటీఆర్' పేరిట నెటిజన్ల నుంచి ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా.. రాజకీయంగా.. సమకాలీన పరిణామాలపై కేటీఆర్ స్పందించారు.
దాదాపు గంటన్నరపాటు కేటీఆర్ ప్రశ్నోత్తరాలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం. ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైంది' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాన కోలుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత బాధ్యత తమపై ఉందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Aghori: అఘోరీని ఇంట్లోకి రానివ్వని కుటుంబీకులు.. నగ్నంగా వస్తే ఎలా రానిస్తాం?
ప్రశ్నోత్తరాలలో కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటుండడంతో కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం వంటి వాటిపై కేటీఆర్ స్పందించారు. 'కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. పార్టీకి మార్గదర్కత్వం చేస్తున్నారు' అని వివరించారు. పార్టీ నేతలపై వేధింపులు.. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంభాషణలో కెటిఅర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.
'అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేం. అయితే వీటికి భయపడేది లేదు' అని కేటీఆర్ హెచ్చరించారు. సన్ నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్‌గా మారిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. రేవంత్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ వెనక్కి పోతోందని తెలిపారు. ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన బావ మరిది ఇంట్లో జరిగిన దావత్‌పై పరోక్షంగా కేటీఆర్ స్పందించారు. 'మేము అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడు ఇతరుల కుటుంబసభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదు. రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబసభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యా. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధం కాదు. ఈ విషయం అత్యంత బాధ కలిగిస్తుంది' అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసే
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. అనేక అంశాలు రెండు పార్టీల నాయకులు కుమ్మకై పని చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీకి మహారాష్ట్ర ఎన్నికల్లో జాతీయ పార్టీలను ప్రజలు ఓటు వేయరాదని పిలుపునిచ్చారు. తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప టీడీపీ, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా అనుబంధం ఉందని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.