Defence Lands Clear For Elevated Corridors: ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన భూమి కేటాయింపు విషయమై కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్‌ రోడ్లకు మహర్దశ పట్టనుంది. త్వరలోనే కరీంనగర్‌ జాతీయ రహదారిలో ట్రాఫిక్‌ కష్టాలు గట్టెక్కనున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వెనుక తమ పోరాటం ఉందని, ఇది తమ ప్రభుత్వ ఘనత అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. స్కై వేల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ కల అని పేర్కొన్నారు. రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశామని గుర్తుచేశారు. దీనికోసం ప్రధాని సహా, కేంద్ర మంత్రులకు పదుల సంఖ్యలో వినతులు వివరించారు. ఇన్నాళ్లకు దిగొచ్చిన కేంద్ర సర్కారుకు రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కై వేల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ఎక్కనివ్వని సిబ్బంది


హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి అంగీకారం తెలపడంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. 'పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉంది' తెలిపారు. ఇది ముమ్మాటికీ తమ పార్టీ సాధించిన విజయమని చెప్పారు. ఈ మార్గంలో రోడ్ల విస్తరణ సాధ్యం కాక ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు పడిన ఇబ్బందులు తొలగిపోనున్నాయని వివరించారు. ఇది ఏ ఒక్కరితోనే సాధ్యం కాలేదని,  సమష్టి విజయమన్నారు.

Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం


ఈ సందర్భంగా తమ పాలనలో చేసిన రోడ్ల అభివృద్ధి విషయమై కేటీఆర్‌ ప్రస్తావించారు. 'ఎల్బీనగర్ తోపాటు.. ఇతర మార్గాల్లో మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లేఓవర్ల నిర్మాణాలు పూర్తి చేశాం. మెరుపు వేగంతో నిర్మించిన ఫ్లేఓవర్లు, అండర్ పాస్‌లతో హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. కేంద్రం తాజాగా కేంద్రం నిర్ణయంతో జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ మార్గాల్లో వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు ఫ్లై ఓవర్ల పనులు ప్రారంభించాలి. హైదరాబాద్ నలుదిశలా విస్తరణతోపాటు ప్రగతిపథంలో నగరం దూసుకుపోతుంది' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి