దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు మాధవనేని ( Raghunandan Rao ) గెలుపు సాధించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ( TRS ) సోలిపేట సుజాత 62022 ఓట్లతో రెండు స్థానాన్ని కైవసం చేసుకన్నారు. ఈ ఓటమిపై తెరాసా పార్టీ వర్కింగ్ ప్రెసెడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే


దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తరువాత స్పందించిన మంత్రి కేటీఆర్ ( KTR ).. గెలుపు ఓటములను సమంగా తీసుకుంటాం అని తెలిపారు. తమ పార్టీని నమ్మి 60 వేలకు పైగా ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపాడు కేటీఆర్. 



Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్


దుబ్బాక ఎన్నికల్లో ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదు అని... గత ఆరున్నర సంవత్సరాలకు ఎన్నో విజయాలు సాధించామని, ఈ రోజు ఆశించింది జరగలేదు అని పేర్కొన్నారు.  సాధారణంగా అందరూ గెలుపు కోసమే పని చేస్తారు. మేము అలాగే చేశాము. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళి తమను అలెర్ట్ చేసినట్టు..ఫలితాలను విశ్లేషించి, ప్రజా తీర్పును సమీక్షించి భవిష్యత్కతు కార్యచరణను సిద్ధం చేస్తాం అని తెలపారు కేటీఆర్.



Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR