KTR Comments: కేటీఆర్ సంచలన కామెంట్స్..ఎంఐఎంతోనే మాకు పోటీ.. బీజేపీకి సింగిల్ డిజిటే.!
KTR Comments: తెలంగాణలో ప్రభుత్వ పాలన, కేంద్ర సర్కార్ తీరు, రాష్ట్రంలో విపక్షాల వైఖరి, వచ్చే ఎన్నికల కార్యాచరణపై మంత్రి కేటీఆర్ కీలక విషయాలు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వూలో కేటీఆర్ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
KTR Comments: తెలంగాణలో ప్రభుత్వ పాలన, కేంద్ర సర్కార్ తీరు, రాష్ట్రంలో విపక్షాల వైఖరి, వచ్చే ఎన్నికల కార్యాచరణపై మంత్రి కేటీఆర్ కీలక విషయాలు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వూలో కేటీఆర్ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చామని.. ప్రజలు కోరుకుంటే మరోసారి పవర్లోకి వస్తామని తెలిపారు. హ్యాట్రిక్ విజయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు కేటీఆర్. 2014లో 63 సీట్లు సాధించిన టీఆర్ఎస్.. 2018లో 88 సీట్లు గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ సీట్లే సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీతో తమకు పోటీయే లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా సింగిల్ డిజిట్ దాటలేరన్నారు. తెలంగాణ కమలం నేతలు వాపును చూసి బలుపుగా భావిస్తున్నారని.. వచ్చే ఎన్నిక్లలో బీజేపీ వంద సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలు ఎక్కడా లేవన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే నిర్మించి చరిత్ర స్పష్టించామన్నారు కేటీఆర్. రైతులకు నిరంతంగా కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ రైతులకు కరెంట్ సరిగా ఇవ్వడం లేదన్నారు. దశాబ్దాలుగా వేధించిన ఫోర్లైడ్ భూతాన్ని తరిమికొట్టామని తెలిపారు.
పార్టీలో నెలకొన్న అసమ్మతిపైనా స్పందించారు కేటీఆర్. పార్టీ బలంగా ఉండటం వల్లే టికెట్ల కోసం పోటీ పెరుగుతుందన్నారు. టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారంటేనే తమ పార్టీ ఎంత స్ట్రాంగో అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఆశలు తీర్చడం ఎవరి వల్ల కాదన్న కేటీఆర్.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో పెద్ద వ్యతిరేకత ఉందని తాము భావించడం లేదన్నారు. ఎమ్మెల్యేలపై జనాల్లో సంతృప్తి లేకపోతే.. దాని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ నేతలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా జరుగుతున్న ఘటనలకు ముఖ్యమంత్రికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. అప్పులపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. మోడీ సర్కార్ రుణాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అప్పులు తేవడం లేదా అని నిలదీశారు.
గవర్నర్ తమిళి సై తీరుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తన గురించి ఆమె ఎక్కువగా ఊహించుకుంటున్నారని అన్నారు. ప్రజల మద్దతుతో ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాల పాలనలో గవర్నర్ పాత్ర చాలా చిన్నదన్నారు కేటీఆర్. గవర్నర్ పోస్టు నామినేటెడ్ అని.. ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్లు వచ్చి పని చేస్తారని తెలిపారు. గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా పని చేసిన తమిళి సైకి .. ఇంకా రాజకీయ వాసనలు పోలేదన్నారు. గవర్నర్ ను అగౌవరపరచాల్సిన అవసరం తమకు లేదన్నారు కేటీఆర్.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనా క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనతో మాట్లాడుతున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాలు, కూటములపై కేసీఆరే వివరిస్తారని చెప్పారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యానని, రెండు సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందన్నారు కేటీఆర్. తాను మంత్రి అవుతానని ఎప్పుడు అనులేదన్నారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని తెలిపారు. ప్రజలు కోరుకుంటే ఏ పదవి చేయడానికైనా తాను సిద్ధమేన్నారు కేటీఆర్.
Also Read:Prashant Kishor: టీఆర్ఎస్‌తో ప్రశాంత్ కిషోర్ కటీఫ్.. వివిధ పార్టీలతో పీకే డీల్స్ రద్దేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.