Benifits of Eating Banana: అరటిపండు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అరటిపండులో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఒకరోజులో అవసరమయ్యే B6లో అరటిపండు ద్వారా 25 శాతం వరకు పొందుతారు. అలాగే, అరటిపండు తినడం ద్వారా మీరు రోజూ తీసుకునే పొటాషియం, విటమిన్ సి, మాంగనీస్‌లో 10 శాతం వరకు శరీరానికి అందుతుంది.
1. అరటిపండులో పోషకాలు :
అరటిపండులో కొలెస్ట్రాల్, సోడియం ఉండవు. కాబట్టి అరటిపండును మీ డైట్‌లో చేర్చుకోవడం చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీలో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం... అరటిపండులో బయో యాక్టివ్ కాంపౌండ్స్ కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అవి మీ కళ్ల ఆరోగ్యానికి మంచివి. అనేక రకాల క్యాన్సర్లకు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
2. డైట్ ఫ్రెండ్లీ
ఒక అరటిపండులో 110 కేలరీలు, 30 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. తద్వారా మీరు ఎక్కువసేపు ఆకలితో ఉండరు. ఇది కాకుండా, ఇది మీ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసే ఒక రకమైన కార్బోహైడ్రేట్, రెసిస్టెంట్ స్టార్చ్‌ని కలిగి ఉంటుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది.
3. రక్తపోటును నియంత్రిస్తుంది
అరటిపండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, మీరు పొటాషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, అది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండు తీసుకోవడం ద్వారా మీ శరీరానికి కావాల్సిన పొటాషియంలో 10 శాతం వరకు దీని ద్వారానే అందుతుంది.
4. యాంటీ వైరల్ మరియు యాంటీమైక్రోబయల్ ప్రాపర్టీస్
అరటిపండులో ఉండే ప్రత్యేక ప్రోటీన్.. యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అరటిపండ్లలో ఉండే ఫెరులిక్ యాసిడ్, లుపియోల్ మరియు లెప్టిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్లను తొలగించడంలో అరటిపండు ప్రయోజనకరంగా ఉంటుంది. అరటిపండు తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ మరింత మెరుగవుతుంది.
5. అరటిపండు డిప్రెషన్‌ను కూడా నివారిస్తుంది
అరటిపండు తినడం వల్ల మీ మూడ్ కూడా బాగుంటుంది. అరటిపండులో ఉండే విటమిన్ బి6 మీకు మంచి అనుభూతిని కలిగించే న్యూరోట్రాన్స్‌మిటర్లు సెరోటోనిన్, డోపమైన్‌లను పెంచడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, మీ శరీరంలో విటమిన్ B6 లోపిస్తే, అది డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి అరటిపండు తినడం ద్వారా డిప్రెషన్ బారిన పడకుండా ఉండొచ్చు.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. దీనిని స్వీకరించే ముందు, కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: SVP title Song: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ వచ్చేసింది...
Also Read: Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.