KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ట్వీట్ల యుద్ధం
KTR VERSES KISHAN REDDY : తెలంగాణలో టీఆర్‌ఎస్ , బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పరస్పరం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది.
KTR VERSES KISHAN REDDY : తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలోని బీజేపీపై టీఆర్‌ఎస్ మంత్రులు నిప్పులు చెరుగుతూ ఉంటే.. రాష్ట్రంలోని కేసీఆర్ పాలనపై బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ ట్విటర్‌కు పని చెప్పారు. వరుస ట్వీట్లతో పరస్పరం వాక్‌బాణాలు ఎక్కుపెట్టారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలో బీజేపీ పాలన వల్ల అన్నింటా కొరత కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీలో పాలనలో బొగ్గు కొరత, కొవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత అంటూ ట్వీట్ చేశారు. అయితే అన్ని సమస్యలకు మూలం పీఎం మోదీ విజన్ కొరత అంటూ తేల్చారు. ఎన్‌పీఏ గవర్నమెంట్ అమేజింగ్ ఫెర్‌ఫార్మెన్స్ అంటూ కొన్ని న్యూస్ క్లిపింగ్స్‌ను జత చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విటర్ వేదికగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో
"ఇంటికో ఉద్యోగం లేదు", "నిరుద్యోగ భృతి లేదు", "ఉచిత ఎరువులు లేదు" "ఋణమాఫీ లేదు, "దళిత ముఖ్యమంత్రి లేదు", "దళితులకు మూడెకరాల భూమి లేదు", "పంటనష్ట పరిహారం లేదు", "దళితబందు లేదు" "బిసిబందు అసలే లేదు", "ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు" "డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు" ,"అప్పులకు కొదవ లేదు", "కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు","కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు","సామాజిక న్యాయం లేదు","సచివాలయం లేదు","సీఎం ప్రజలను కలిసేది లేదు","ఉద్యమ కారులకు గౌరవం లేదు","విమోచన దినోత్సవం జరిపేది లేదు". ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
గతం కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట యుద్ధం కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంపై రెండు పార్టీల మధ్య రచ్చ జరిగింది. అటు వీలు చిక్కినప్పుడల్లా కేటీఆర్ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్నాయంటూ ఇటీవల ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల వర్చువల్ భేటీ సందర్భంగా కామెంట్స్ చేశారు. వ్యాట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందులో తెలంగాణ పేరు కూడా ఉండటంతో మంత్రి కేటీఆర్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అసలు తాము వ్యాట్ పెంచకపోయినా... పెంచారంటూ తెలంగాణ పేరును ఎందుకు ప్రస్తావించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటూ నిలదీశారు. 2014 నుంచి ఇప్పటివరకూ తాము వ్యాట్ పెంచలేదని... కేవలం ఒకసారి సవరణ చేశామని గుర్తు చేశారు. తాజాగా మరోసారి రెండు పార్టీల నేతల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం కొనసాగడం పొలిటికల్ హీట్ పెంచింది.
Also Read: Bandi Sanjay: కోయిల్ సాగర్ పనులు చూస్తే కోట శ్రీనివాస్ గుర్తుకొస్తున్నరు: బండి
Also Read: Nissan New Model: 'డాట్సన్' నిలిపివేత.. ఇండియన్ మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త మోడల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook