KTR Vs Revanth: కేటీఆర్ వర్సెస్ రేవంత్ ట్వీట్ వార్.. డ్రగ్స్ పరీక్షలపై విసిరిన వైట్ ఛాలెంజ్‌పై రచ్చరచ్చ
KTR Vs Revanth twitter war: డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానన్నారు రేవంత్. అక్కడితో ఆగలేదు. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాన్నట్లు పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు.
KTR Vs Revanth twitter war: Minister KTR takes legal action against Revanth Reddy: మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల మధ్య మాటలయుద్ధం జోరుగా సాగుతోంది. ఇద్దరి మధ్య ట్వీట్స్ వార్ రసవత్తరంగా సాగుతోంది. కౌంటర్‌కు ప్రతి కౌంటర్‌లతో రెచ్చిపోతున్నారు ఇద్దరూ. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు తాను వైట్ ఛాలెంజ్ (white challenge) ప్రారంభిస్తున్నానని ఇటీవల రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం తాను సిద్ధమని.. డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానన్నారు రేవంత్. అక్కడితో ఆగలేదు. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి (konda vishweshwar reddy) ఛాలెంజ్ విసురుతున్నాన్నట్లు పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు.
అంతేకాదు వాళ్లిద్దరూ ఛాలెంజ్‌ను స్వీకరించి.. మరో ఇద్దరికి ఛాలెంజ్ విసరాలని కోరారు రేవంత్. సోమవారం తాను గన్‌పార్కు వద్దకు చేరుకుంటానని.. ఏ ఆస్పత్రికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. డ్రగ్స్ పరీక్షల (drug tests) కోసం నమూనాలు ఇద్దామని కోరారు. అయితే రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ తనదైన స్టైల్‌లో రెస్పాండ్ అయ్యారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనన్నారు. కాకపోతే తన ఛాలెంజ్ స్వీకరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సిద్ధమా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Also Read : SpaceX Mission Success: అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ పర్యాటక యాత్ర విజయవంతం
చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదు
రాహుల్ ఒప్పుకొంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో (AIIMS) పరీక్షలకు తాను సిద్ధమన్నారు కేటీఆర్. కాకపోతే తనది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదంటూ రేవంత్‌పై సెటైర్ వేశారు. డ్రగ్స్ పరీక్షల్లో తనకు క్లీన్‌చిట్ వస్తే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పి తన పదవులన్నీ వదులుకుంటారా అని సవాల్ విసిరారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ (lie detector) పరీక్షలకు రేవంత్ సిద్ధమా అంటూ రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
కోర్టులో పరువునష్టం దావా
అయితే సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్ పరీక్షకు హాజరయ్యేందుకు తాను సిద్ధమని.. దీనికి సమయం, స్థలం చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు రేవంత్. ఇక రేవంత్‌రెడ్డి ట్వీట్స్‌పై కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Also Read : Modi: మోదీ కానుకలు, మెమెంటోలకు ఈ–వేలం.. ఒలింపిక్ హీరోలు ఉపయోగించిన వస్తువులు కూడా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook