SpaceX Mission Success: అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ పర్యాటక యాత్ర విజయవంతం

SpaceX Mission Success: అంతరిక్షం ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. మూడ్రోజుల స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్-4 యాత్ర విజయవంతం కావడమే దీనికి నిదర్శనం. ఆ యాత్ర వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 20, 2021, 01:56 PM IST
  • విజయవంతమైన స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్ -4 యాత్ర
  • అంతరిక్షంలో సైతం సాధారణ పర్యాటకుల్ని పంపిన ఘనత సాధించిన ఎలాన్ మస్క్
  • మూడ్రోజులపాటు విజయవంతంగా సాగి సురక్షితంగా ల్యాండ్ అయిన స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్
SpaceX Mission Success: అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ పర్యాటక యాత్ర విజయవంతం

SpaceX Mission Success: అంతరిక్షం ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. మూడ్రోజుల స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్-4 యాత్ర విజయవంతం కావడమే దీనికి నిదర్శనం. ఆ యాత్ర వివరాలు తెలుసుకుందాం.

అంతరిక్షమంటే అదొక అందమైన, సాహసోపేతమైన అనుభూతి. ఓ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్. కేవలం శాస్త్రవేత్తలకే పరిమితమైంది. ఇదంతా నిన్నటి మాట. ఇక ఇప్పుడు అంతరిక్షం అందరిదీ. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. అంతరిక్షాన్ని సైతం పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఆలోచన విజయవంతమైంది. ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అంతరిక్షంలో సాధారణపౌరులు సైతం వెళ్లి రావచ్చని నిరూపించారు. 

స్పేస్‌ఎక్స్(SpaceX) సంస్థకు చెందిన ఇన్‌స్పిరేషన్-4 యాత్ర విజయవంతంగా ముగిసింది. మూడ్రోజులపాటు ముచ్చటగా సాగిన ప్రైవేటు వ్యక్తుల రోదసీ యాత్ర సక్సెస్ అయింది. అపరు కుబేరుడు జేర్డ్ ఐసాక్ మ్యాన్ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో మూడ్రోజుల క్రితం క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్షంలో వెళ్లింది. మూడ్రోజుల అనంతరం ఫ్లోరిడా(Florida)తీరంలోని అట్లాంటిక్ మహా సముద్రంలో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో యాత్ర విజయవంతమైందని తేలింది. భవిష్యత్‌లో మరిన్ని ప్రైవేట్ యాత్రలకు నాంది పలికింది ఈ యాత్ర. 

ఇన్‌స్పిరేషన్-4 (Inspiration-4)యాత్రను స్పాన్సర్ చేసిన ఐసాక్ మ్యాన్ స్పేస్‌ఎక్స్ సంస్థకు ఎంత చెల్లించారో ఇంకా తెలియలేదు కానీ కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elon musk) మాత్రం కంపెనీ ద్వారా తొలిసారిగా పర్యాటకుల్ని పంపిన ఘనత సాధించారు. స్పేస్‌ఎక్స్ క్యాప్యూల్ సురక్షితంగా ల్యాండ్ కాగానే ఈ మిషన్‌తో అంతరిక్షం అందరిదైందని స్పేస్‌ఎక్స్ మిషన్ కంట్రోల్ నినాదాలు చేసింది. అమెరికాలోని ఫ్లోరిడా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టి..తిరిగొచ్చింది. క్యాప్సూల్‌కు అమర్చిన బబుల్ ఆకారంలోని గాజు కిటికీ ద్వారా అందులోని ప్రయాణీకులు నలుగురూ అంతరిక్షాన్ని పూర్తిగా చూసి ఆనందించారు. అంతరిక్షాన్ని చూడటం ఓ అద్భుతమైన అనుభూతిగా అభివర్ణించారు ఐసాక మ్యాన్. అంతరిక్షంలో(Space) మూడ్రోజుల ప్రయాణంలో తినడానికి కావల్సిన ఆహారాన్ని వెంట తీసుకెళ్లారు. రోదసీ యాత్ర ముగిసిన అనంతరం నలుగురు పర్యాటక యాత్రికుల ఆరోగ్యం బాగుందని వైద్యులు ధృవీకరించారు. 

Also read: Covaxin: కోవాగ్జిన్ భవితవ్యం తేలేది అక్టోబర్ 6న, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం కీలక భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News