Rain Alert: తెలంగాణ ప్రజలారా బీఅలర్ట్..మరో మూడు వారాలపాటు ఇక వానలే..!
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Rain Alert: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ద్రోణి సైతం విదర్భ నుంచి తెలంగాణ వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కేంద్రీకృతమైంది. ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు చోట్ల భారీగా వానలు పడనున్నాయి. ఎల్లుండి రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈపరిస్థితి మరో మూడు వారాల పాటు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 25 వరకు వర్ష సూచన కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు వారాలపాటు జోరుగా వానలు పడే పరిస్థితి ఉంది. మరికొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అయ్యింది. నైరుతి ప్రభావం కంటే ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్‌తోనే వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. లోతుట్టు ప్రాంతాల పట్ల ముందస్తు చర్యలు అవసరమని భారత వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండలు కొనసాగుతూనే..వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
Also read:YSRCP Leaders: ఏపీలో వివాదాస్పదమవుతున్న వైసీపీ నేతల తీరు..ఆ పార్టీ అధిష్టానం సీరియస్..!
Also read:New CJI: కొత్త సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్..ప్రతిపాదించిన జస్టిస్ ఎన్వీ రమణ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook