Leopard attack video : వలకు చిక్కిన చిరుత.. అటవీ శాఖ సిబ్బందిపై దాడి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
వలకు చిక్కిన చిరుతపులి ( Leopard trapped in net ) చిక్కినట్టే చిక్కి తప్పించుకుని.. దానిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందిని ( Forest range ) ముప్పుతిప్పలు పెట్టింది. మర్రిగూడ మండలం రాజాపేట తండా శివారులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అక్కడ గ్రామస్తులు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చుకు చిరుతపులి చిక్కడం గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
నల్గొండ : వలకు చిక్కిన చిరుతపులి ( Leopard trapped in net ) చిక్కినట్టే చిక్కి తప్పించుకుని.. దానిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందిని ( Forest range ) ముప్పుతిప్పలు పెట్టింది. మర్రిగూడ మండలం రాజాపేట తండా శివారులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అక్కడ గ్రామస్తులు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చుకు చిరుతపులి చిక్కడం గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు అందించిన సమాచారంతో రాజాపేట తండాకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతపులిని బంధించేందుకు ప్రయత్నిస్తుండగా ( Trapping leopard ) అది తప్పించుకుని సిబ్బందిపైనే దాడికి పాల్పడింది. చిరుతపులి దాడి ( Leopard attacks forest dept staff ) నుంచి తప్పించుకున్న సిబ్బంది అతి కష్టంమీద దానిని పట్టుకుని బంధించారు. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించాల్సి వచ్చిందని ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు ( Leopard attack rare videos) చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. చిరుతపులి దాడిలో తీవ్రంగా గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కి తరలించారు. ( నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను మొసలి ఎలా వేటాడుతుందో చూడండి ? )
చిరుతపులి మహబూబ్ నగర్, నల్గొండ సరిహద్దులను ఆనుకుని ఉన్న నల్లమల అడవుల్లోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కి చెందినది అయ్యుంటుందని అటవీ శాఖ సిబ్బంది భావిస్తున్నారు. పట్టుబడిన చిరుతను హైదరాబాద్‌లోని జూపార్క్‌కి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తరచుగా గ్రామ శివార్లలో చిరుత పులుల సంచారం కంటపడుతోందని.. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలన్నా హడలిపోవాల్సి వస్తోందని చెబుతున్న గ్రామస్తులు.. చిరుతపులుల బాధ నుంచి తప్పించుకునేందుకే ఉచ్చు బిగించామంటుని అంటున్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న వణ్యమృగాలను సంరక్షించడం తెలియని అటవీ శాఖ సిబ్బంది పులుల సంచారాన్ని నివారించకపోగా.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..