Liquor Shops In Hyderabad To Be Closed: సాధారణంగా ఎన్నికల సమయంలో వైన్స్ షాపులు, బార్లు, మద్యం దుకాణాలు మూసివేస్తారు. తాజాగా హోలీ పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు తాత్కాలికంగా నిషేధం విధించారు. వైన్ షాప్స్ బంద్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 28న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30న ఉదయం 6 గంటల వరకు మొత్తం 36 గంటలపాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లో వైన్స్ షాప్‌లు(Wine Shops), ఇతర మద్యం దుకాణాలు, బార్లు ఆ సమయంలో తెరవకూడదని పేర్కొన్నారు.


Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో 500కు చేరువలో కరోనా కేసులు, GHMCలో వైరస్ విజృంభణ


కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హోలీ పండుగకు సైతం ఆంక్షలు విధించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో రంగులు చల్లకూడదని మరో ప్రకటనలో తెలిపారు. ఒకవేశ వాహనాలపై వెళ్తూ రంగులు చల్లుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేయడంగానీ, వారిని అసౌకర్యం కలిగించినా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. 


కాగా, తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 56,464 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 493 మందికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 4 వేల 7 వందల తొంబై ఒకటికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,680కి చేరింది.


Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook