Degree And PG Semester Exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా, ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం

Telangana Degree, PG Semester Exams Postponed: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా, ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో విద్యాసంస్థలు బంద్ చేయాలని రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 24, 2021, 08:03 PM IST
Degree And PG Semester Exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా, ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం

Degree, PG Semester Exams Postponed In Telangana: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షయి వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. కరోనా కేసులు తగ్గి, సాధారణ పరిస్థితి నెలకొన్న అనంతరం డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను త్వరలోనే రీ షెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ పరిధిలలో షెడ్యూల్ ప్రకారం జరగబోయే పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రొఫెసర్‌ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలని టీఆర్ఎస్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని యూనివర్సిటీలు నిన్న స్పష్టం చేయగా, తాజాగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి పరీక్షల వాయిదాలపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Talasani Srinivas Yadav: థియేటర్ల మూసివేత వదంతులపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 

కాగా, నిన్న ఒక్కరోజు కోలుకున్న వారి సంఖ్య కన్నా పాజిటివ్ కేసులే అధికంగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. మంగళవారం నాడు 228 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 2,99,270 మంది కరోనాను జయించారు. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 111 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడం హైదరాబాద్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News