New Year offer : మందు బాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31న అప్పటి వరకు వైన్ షాప్స్ ఓపెన్
తెలంగాణలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల వేళల్లో మార్పు చేర్పులు చేసింది గవర్నమెంట్. (TS Government) డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు (Wine shops) తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
Liquor shops to be open till 12 am on December 31st night Events can be organize till 1 am January 2022: తెలంగాణలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల వేళల్లో మార్పు చేర్పులు చేసింది గవర్నమెంట్. (TS Government) డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు (Wine shops) తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
అలాగే అర్ధరాత్రి ఒంటి వరకు ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. జనవరి 1న బార్లు, (Bars) క్లబ్‌లు, స్పెషల్ ఈవెంట్లకు ఈ ప్రత్యేక అనుమతి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) ఆదేశాలు జారీ చేశారు. అయితే న్యూ ఇయర్ వేడుకల (New Year celebrations) సందర్భంగా కరోనా నిబంధనలఉ కచ్చితంగా పాటించాలంటూ ప్రభుత్వం సూచించింది. ఈవెంట్స్ (Events) నిర్వహణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ సర్కార్ (TS Sarkar) సూచించింది.
Also Read : promotion tips : ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా.. సమాజంలో గౌరవం పెరగాలన్నా ఇలా చేస్తే సరి..
ఈవెంట్స్‌లలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి లైసెన్స్ ఫీజు రూ.50,000 నుంచి రెండున్నర లక్షల దాకా ఉంటుందని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ (New Year) వేడుకలను కోవిడ్ (Covid) నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలి అని ఇరు ప్రభుత్వాలు సూచించాయి. ఆ మేరకు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read : Omicron: తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook