New Year 2022: న్యూ ఇయర్​ పార్టీ చేసుకోవాలా? బెస్ట్​ ప్రాంతాలు ఇవే..

New Year 2022: కొత్త సంవత్సరంలోకి మరో ఐదు రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదా? అయితే టాప్​ న్యూ ఇయర్ పార్టీ ప్లేస్​ల గురించి మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 04:08 PM IST
New Year 2022: న్యూ ఇయర్​ పార్టీ చేసుకోవాలా? బెస్ట్​ ప్రాంతాలు ఇవే..

New Year 2022: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. 2021కి గుడ్​ బై చెప్పి (Good bye to 2021).. 2022కు వెల్​కం చెప్పేందుకు అప్పుడే సన్నాహాలు (Happy new Year) మొదలయ్యాయి

చాలా మంది ఇయర్​ ఎండ్, న్యూ ఇయర్​ వేడుకలు (New Year Party in India) ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. పైగా ఈ సారి వీకెండ్ (Weekend Parties)​ కూడా రావడంతో రెండు, మూడు రోజులు ఏంజాయ్​ చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు.

ఈ సారి పార్టీ ఎక్కడ జరుపుకోవాలనే విషయంపై చాలా మంది అయోమయంలో ఉంటారు. మీకూ అలాంటి సందేహాలే ఉంటే.. మీకో గుడ్​ న్యూస్​. సారి న్యూ ఇయర్ పార్టీ చేసుకునేందుకు 5 బెస్ట్ ప్లేసెస్​ వివరాలు ఇప్పుడు (Best Place for New Year Party) తెలుసుకుందాం.

1 సన్​బర్న్​(గోవా)

మన దేశంలో న్యూ ఇంయర్​ పార్టీ అంటే.. ముందుగా గుర్తొచ్చేది గోవానే. సముద్రపు తీరంలో కొత్త సంవత్సరం సెలబ్రెట్​ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్​ అని (New Year Party in Goa) చెప్పొచ్చు. ఈ పార్టీలో మ్యూజిక్​​ బ్యాండ్​, ఫేమస్​ ఆర్టిస్ట్​లతో లైవ్​ షో ఉంటుంది. కావాల్సినన్ని ఫుడ్ వెరైటీస్​.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి పార్టీ ప్రత్యేకత.

2.అరోమా గార్డెన్స్(పుదుచ్చెరి)

ప్రశాంతమైన వాతావరణంలో పార్టీ జరుపుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్​. సాధారణ పార్టీలతో పోలిస్తే.. ఇది భిన్నంగా ఉంటుంది. పచ్చని తోటల మధ్య హాయిగా ఎంజాయ్​ చేస్తూ ఇక్కడ పార్టీలో పాల్గొనొచ్చు. లైట్ మ్యూజిట్, డ్యాన్స్​లు వంటివి, మంచి ఫుడ్ ఇక్కడి ప్రత్యేకత.

3.ది 5-స్టార్​ (బెంగళూరు)

ఇండియా ఐటీ హబ్​గా పిలిచే బెంగళూరులో.. న్యూ ఇయర్ పార్టీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లీలా కెంపిన్స్కిలో రిచ్​గా ఈ పార్టీ జరుగుతుంది. దిగ్గజ ఆర్టిస్టులతో మ్యూజిక్​, ప్రత్యేక డ్యాన్స్​ షోలు ఉంటాయి. అన్నిటికి మించి అద్భుతమైన వాతావరణలో.. రుచికరమైన భోజనం (కావాల్సినన్ని వెరైటీలు), డ్రింగ్స్ ఈ పార్టీకి వచ్చే వారికోసం అందుబాటులో ఉంటాయి.

4.పడవలో పార్టీ (అండమాన్​, నికోబార్​ ఐస్​లాండ్స్​)

సాధారణ పార్టీల నుంచి డిఫరెట్​ ఎక్స్​పీరియన్స్​ కావాలనుకునే వారు పడవలో కూడా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు. అండమాన్, నికోబార్ ఐస్​లాండ్స్​లో ఈ అవకాశముంది. దీనితో పాటు.. పోర్ట్​ బ్లెయర్​, సిల్వర్​ సాండ్ బీచ్​ రిసార్ట్​, సీ ప్రిన్నసెస్​ బీచ్​ రిసార్ట్​, సింక్లెర్స్​ బే వ్యూ, పీర్​లెస్ రిసార్ట్ వంటి ప్రాంతాలు ఇక్కడ పార్టీకి ప్రసిద్ధి.

5.నహర్​గఢ్ ఫోర్ట్ పార్టీ (జైపూర్​)

ల్యాండ్​ ఆఫ్​ కింగ్​గా పిలిచే జైపూర్​లో కూడా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడున్న నహర్​గఢ్​​ కోటలో అంతర్జాతీయ స్థాయి డీజేలతో ప్రత్యేక షోలు నిర్వహిస్తారు. పాప్​ సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు. ఇంక రాజస్థాన్​ ప్రత్యేక వంటకాలతో ఇతర డ్రింక్స్​తో ఇక్క పార్టీ జరుగుతుంది.

Also read: Tips to lose Weight: బరువు తగ్గేందుకు ఏడురోజుల్లో ఏడు టిప్స్, చేసి చూడండి

Also read: Malaika Arora Yoga Tips: బెల్లీ ఫాట్ తగ్గించేందుకు మలైకా అరోరా చెప్పిన టిప్స్ మీరూ పాటించండి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News