JP NADDA MEETING LIVE UPDATES: నయా నిజాంను సాగనంపడానికే సంజయ్ యాత్ర.. కేసీఆర్ ఖేల్ ఖతమేనన్న జేపీ నడ్డా
JP NADDA MEETING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. సాయంత్రం హన్మకొండలో జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
JP NADDA MEETING: హన్మకొండ సభలో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. హన్మకొండలో జరిగిన న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు. నడ్డా బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. సభకు భారీగా జన సమీకరణ చేసింది.
Latest Updates
తెలంగాణలో నయా నిజాం వచ్చారు
తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
బీజేపీ సభకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు
కేంద్రం దగ్గర పైసలు తీసుకుని కేసీఆర్ తన పేరు పెట్టుకున్నారు
బీజేపీ లో చేరిన పెద్దపల్లి నియోజకవర్గ నేత సురేష్ రెడ్డి
హైదరాబాద్ నోవాటేల్ హోటల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరిక
పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేస్తున్న సురేష్ రెడ్డి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో క్రికెటర్ మిథాలీ రాజ్ సమావేశం
జేపీ నడ్డాతో క్రికెటర్ మిథాలీ రాజ్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి
మిథాలీ రాజ్ ను నడ్డా బీజేపీలోకి ఆహ్వానించారనే ప్రచారం
హైదరాబాద్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం చెప్పిన తెలంగాణ బీజేపీ నేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో కీలక సమావేశాలు జరగనున్నాయి. హన్మకొండ బహిరంగ సభ అనంతరం శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో కీలక సమావేశాలు జరపనున్నారు. హీరో నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్ లు జేపీ నడ్డాను కలవనున్నారు. టీవీ9 యజమాని, మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి.
జేపీ నడ్డా బహిరంగ సభ నేపథ్యంలో వరంగల్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల రగడ కాక రేపుతోంది. బండి సంజయ్‌కి ప్రజా సంగ్రామ యాత్రకు స్వాగతం చెబుతూ వరంగల్, హన్మకొండలో బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ ఫ్లెక్సీలను అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నేతలే తన పార్టీ ఫ్లెక్సీలను చంచివేశారని ఆరోపించారు. నిరసనకు దిగిన కమలం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.