Congress Manifesto Announcement: కేసీఆర్‌కు చర్లపల్లిలో జైలులో చిప్పకూడు తినిపిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
Congress Tukkuguda Meeting Live Updates: తుక్కుగూడ జనజాతర సభకు సర్వ సిద్ధమైంది. భారీగా ప్రజలు తరలిరావడంతో జనసంద్రంగా మారింది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖరావం పూరించనుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. జనజాతర సభ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Congress Tukkuguda Meeting Live Updates: కాంగ్రెస్ నినాదాలతో తుక్కుగూడ మార్మోగుతోంది. కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభతో జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారు. తుక్కుగూడ వేదికగానే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది కాంగ్రెస్. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భారీగా జనసమీకరణ చేసింది. దాదాపు 10 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జాతీయ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి 23 అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగ సభ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతున్నా.. హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. తుక్కుగూడ మీటింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
==> మా వంద రోజుల పాలన మీ ముందు ఉంది: రేవంత్ రెడ్డి
==> తెలంగాణలో కాంగ్రెస్‌కు 14 ఎంపీ సీట్లు ఇవ్వండి
==> దేశాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నం చేద్దాం
==> పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు
==> పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు
Tukkuguda Meeting Updates: కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఉండేలా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని అన్నారు. కాలు విరిగింది.. కూతురు జైలుకు వెళ్లిందంటే కనికరం చూపించామన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిన చోటే ఓట్లు అడగాలన్నారు.
Tukkuguda Meeting Updates: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష సరిగాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన భాష ఇలాగే ఉంటే.. చర్లపల్లి జైలులో చిప్పకూడ తినిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని..? అని ప్రశ్నించారు.
Tukkuguda Meeting Updates: జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ గాంధీ అంకితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదన్నారు. BRSను తుక్కుతుక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోందన్నారు.
Tukkuguda Meeting Updates: దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. తమ మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని విమర్శించారు. రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చామని వెల్లడించారు.
Congress Manifesto Announcement: స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామన్నారు. దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారని.. అన్నదాతలకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు.
Congress Manifesto Announcement: పేద మహిళలకు ఏటా రూ.లక్ష నేరుగా బ్యాంకులో వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు నెలకు రూ.8,500 ఇస్తూ.. శిక్షణ ఇకపై దేశంలో ఏ కుటుంబానికీ ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని అన్నారు.
Congress Manifesto Announcement: నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రూ.లక్ష శిక్షణ భృతి సాధికారిత
==> ఉద్యోగ నియామక భరోసా 30 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఖాళీలు భర్తీ
==> పేపర్ లీకుల నుంచి విముక్తి, పేపర్ లీకులకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన విధానాలతో చట్టాలు రూపకల్పన
==> యువ కాంతి-యువత కోసం రూ.5 వేల కోట్లతో కొత్త స్టార్టప్ ఫండ్Congress Manifesto Announcement: యువన్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం పేరుతో ఐదు గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించారు.
Congress Manifesto Announcement: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది: రాహుల్ గాంధీ
మన దేశంలో నిరుద్యోగులు అందరికీ రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు ఇప్పించబోతున్నాం..
Jana Jathara Sabha Live Updates: న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. ఐదు గ్యారంటీల పత్రాన్ని విడుదల చేశారు.
Jana Jathara Sabha Live Updates: అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్‌ను కాంగ్రెస్ ఫాలో అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా తుక్కుగూడ సభ నుంచి శంఖారావం పూరించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ఈ సభ నుంచి మొదలుపెట్టనున్నారు.
Jana Jathara Sabha Live Updates: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తున్న జన జాతర సభకు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పలువురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
Jana Jathara Sabha Live Updates: తుక్కుగూడ సభ మీటింగ్‌ను లైవ్‌లో ఇక్కడ చూడండి.
Jana Jathara Sabha Live Updates: జనజాతర సభకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.