Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఎంతో తప్పనిసరైతే తప్పించి అనవసహరంగా బయటికి వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ వరద నీరు రోడ్లపైకి చిమ్ముతోంది. దీంతో ఆఫీసులకు, వివిధ పనులపై బయటికి వెళ్లొచ్చే వారు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. నగరంలో అనేక చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఎంతో తప్పనిసరైతే తప్పించి అనవసహరంగా బయటికి వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది. నగరం నలుమూలలా డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా ఉండి తమ అవసరం ఉన్న చోట పౌరులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులకు సూచించింది.
Latest Updates
హైదరాబాద్‌లో నేడు అత్యధికంగా మూసాపేట్‌లో 81.6 మిల్లీ మీటర్లు, గాజుల రామారంలో 78.8 మి. మీ, కూకట్‌పల్లిలో 68.2 మి.మీ వర్షపాతం నమోదైంది.