Rave Party Latest Live Updates: కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌ రేవ్‌ పార్టీ.. రంగంలోకి మాజీ సీఎం కేసీఆర్

Sun, 27 Oct 2024-8:23 pm,

Ktr Brother In Law Farm House Rave Party Latest Live Updates: మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై లవ్‌ అప్‌డేట్స్‌

Ktr Brother In Law Farm House Rave Party Latest Live Updates: తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిందనే వార్త ఒక్కసారిగా సంచలనం రేపింది. హైదరాబాద్‌ శివారులోని జన్వాడ గ్రామ పరిధిలో కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున ఓ పార్టీ జరిగిందని సమాచారం. భారీ డీజే శబ్దాలతో ఫామ్‌ హౌస్‌లో రచ్చరచ్చ రేపుతున్నారనే సమాచారం తెలుసుకున్న సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేయగా రేవ్‌ పార్టీ వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 యువతులు పాల్గొన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పార్టీలో భారీగా మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కొందరికి పరీక్షలు చేయగా ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. డ్రగ్ నిర్ధారణ కావడంతో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఈఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరి ప్రమేయం ఉంది అనే వివరాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పార్టీపై కేటీఆర్‌ కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కానీ స్పందించలేదు.


కాగా ఈ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ మాదక ద్రవ్యాలకు అడ్డాగా హైదరాబాద్‌ను చేశారని ఆరోపిస్తున్నారు. కేటీఆర్‌ను కూడా విచారించాలని కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, రఘునందన్‌ రావు తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదిరేటట్టు కనిపిస్తోంది.


కఠినంగా శిక్షిస్తాం
రేవ్‌ పార్టీ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపీ ఎంపీ అనిల్ యాదవ్ స్పందించారు. 'కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సొంత ఫామ్ హౌస్‌లో డ్రగ్, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చారు. ఇది రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉంది' అని తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టమని.. కఠినంగా శిక్షించాల్సిందే అని స్పష్టం చేశారు.


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Latest Updates

  • రంగంలోకి కేసీఆర్‌..డీజీపీకి ఫోన్‌ కాల్‌
    మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది ఇంట్లో పార్టీ వివాదంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఫామ్ హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిందని రాద్ధాంతం చేస్తూ కుటుంసభ్యులను ఇష్టారీతిన తనిఖీలతో భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజు పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలపై డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని నిలదీసినట్లు వార్త బయటకు వచ్చింది. సోదాలు వెంటనే ఆపాలని డీజీపీని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది.

  • బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆందోళన
    రాజ్ పాకాల సోదరుడు విల్లా దగ్గర తీవ్ర ఉద్రిక్తత. జాయింట్ కమిషనర్ ఎక్సైజ్ ఖురేషి నేతృత్వంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ సోదాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేకానంద్‌, సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అక్కడకు భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవద్ధవంటూ ఎక్సైజ్ పోలీసులు నచ్చ జెపుతున్నారు.

     

  • కేటీఆర్‌ బావ మరిది పార్టీ.. రంగంలోకి కాంగ్రెస్‌ మహిళలు
    జన్వాడ ఫార్మ్ హౌస్‌లో జరిగిన పార్టీపై వెంటనే కాంగ్రెస్‌ మహిళా నాయకులు స్పందించారు. కేటీఆర్ బావ మరిది రాజు పాకాల పార్టీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు. కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత ఏసీపీకి ఫిర్యాదు అందించారు.

  • ఇది డైవర్షన్‌ పాలిటిక్స్‌
    కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీని ఏమీ లేకుండానే కుట్రపూరితంగా ప్రభుత్వం హల్‌చల్‌ చేస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ పేర్కొంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. 'కేటీఆర్‌ను ఇరికించాలని ప్రయత్నంలో రేవంత్‌ రెడ్డి చేస్తున్న డ్రామా ఇది' అని తెలిపారు. హామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిడ్డారు.

  • కేటీఆర్‌ ఇంటి వద్ద పోలీసుల మొహరింపు

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      ఓరియన్ విల్లా నంబర్ 4 కేటీఆర్‌ ఇంటి వద్ద మొహరించిన పోలీసులు. విల్లా నంబర్ 4 శైలేందర్ పాకాల ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు 

    • విల్లా నంబర్ 40లోని రాజు పాకాల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.
       

    ఇది ఇంటి పార్టీ
    రేవ్ పార్టీ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు స్పందిస్తున్నారు. అది రేవ్ పార్టీ కాదని.. కుటుంబసభ్యులు.. బంధుమిత్రులు చేసుకున్న విందుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమాల ప్రతినిధి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీశ్ స్పందించారు. 'ఇది పూర్తిగా ఇంట్లో వాళ్లు చేసుకున్న పార్టీ'గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచనామా అంటూ వచ్చిన ఒక రిపోర్టును బయటపెట్టారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link