Secunderabad Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. అంతా ప్రీ-ప్లాన్డ్ గానే జరిగిందా..?
Secunderabad Agnipath Protests Live Updates: `అగ్నిపథ్` మంటలు తెలంగాణలోనూ రాజుకున్నాయి. శుక్రవారం (జూన్ 17) ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం చెలరేగింది. ...
Secunderabad Agnipath Protests Live Updates: 'అగ్నిపథ్' మంటలు తెలంగాణలోనూ రాజుకున్నాయి. శుక్రవారం (జూన్ 17) ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పలువురు ఆందోళనకారులు మొదట పట్టాలపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. పలు రైళ్ల భోగీలతో పాటు పార్శిళ్లకు నిప్పంటించారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరపగా.. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 10 గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత కొనసాగింది. చివరకు పోలీసులు పరిస్థితిని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. నిరసనకారులను అదుపులోనికి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ను క్లియర్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో హింసాత్మక ఘటనలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం...
Latest Updates
Bandi Sanjay About Agnipath Protests: సీఎం క్యాంప్ ఆఫీసు నుంచే సికింద్రాబాద్ విధ్వంసానికి స్కెచ్ : బండి సంజయ్
Bandi Sanjay Comments on Agnipath Protests: సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లపై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. అగ్నిపథ్ పథకంపై బురద జల్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయవచ్చని టీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రే సికింద్రాబాద్ విధ్వంసం అని బండి సంజయ్ మండిపడ్డారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Secunderabad Agnipath Protests Mastermind: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం వెనుకున్న మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు ఏపీలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమి నిర్వాహకుడైన సుబ్బారావుని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం.. Read: Agnipath Riots: అగ్నిపథ్ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?
Revanth Reddy Arrested at Ghatkesar: ఘట్కేసర్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తంచేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లకు పాల్పడిన వారిని నిలువరించే క్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్ బయల్దేరిన రేవంత్ రెడ్డిని ఘట్‌కేసర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాకేశ్‌ని చంపింది టీఆర్ఎస్ పార్టీ అయితే.. చంపించింది బీజేపి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం.
Agnipath Protests Live Updates: సికింద్రాబాద్‌లో అగ్నిపథ్ పథకం అల్లర్ల వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవడానికంటే ముందుగానే వారి వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసం గురించి వ్యూహరచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటానికి అవసరమైన వస్తు, సామాగ్రిని తీసుకురావాల్సిందిగా ఒకరికొకరు చెప్పుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వార్తా కథనం చదవండి
రాత్రి 8-30కి సికింద్రాబాద్ నుంచి మొదటి రైలు
లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లనున్న రైలు
ఈ రాత్రి నుంచి వెళ్లాల్సిన అన్ని రైళ్లు పునరుద్దరణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన లో అల్లర్లపై కేసు నమోదుసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో ఏడు కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని రైల్వే అధికారి డీఆర్ఎమ్ గుప్తా చెప్పారు. నాలుగు కోచ్ దగ్దమయ్యాయి, మరో 30 బోగీలు పాక్షికంగా ధ్వంసం అయినట్లు తెలిపారు. పోలీసుల సాయంతో నిరసనకారులను అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంతా క్లియర్
10 గంటల తర్వాత అదుపులోనికి వచ్చిన పరిస్థితులు
నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉదయం 9 గంటల నుంచి స్టేషన్ లో హై టెన్షన్
సికింద్రాబాద్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్
నిరసనకారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు
పట్టాలను క్లియర్ చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు
8 గంటల తర్వాత రైళ్లు పునరుద్దరించే అవకాశం
రైల్వే చీఫ్ పిఆర్వో రాకేష్..
సికింద్రాబాద్ స్టేషన్ పలు రైళ్లు దగ్ధం కావడం విచారకరం
ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న వారి అమౌంట్ మొత్తం వాపస్ ఇస్తాం
ఇవ్వాలిటికి మాత్రమే రైళ్లు క్యాన్సల్ చేశాం
రేపటి నుంచి తిరిగి యధావిధిగా నడుపుతాం
పరిస్థితి అదుపులోకి వస్తే త్వరగా నడపడానికి ప్రయతిస్తాం
రైల్వే చీఫ్ పిఆర్వో రాకేష్..
సికింద్రాబాద్ స్టేషన్ పలు రైళ్లు దగ్ధం కావడం విచారకరం
ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న వారి అమౌంట్ మొత్తం వాపస్ ఇస్తాం
ఇవ్వాలిటికి మాత్రమే రైళ్లు క్యాన్సల్ చేశాం
రేపటి నుంచి తిరిగి యధావిధిగా నడుపుతాం
పరిస్థితి అదుపులోకి వస్తే త్వరగా నడపడానికి ప్రయతిస్తాం
అగ్నిపథ్ స్కీంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఫైర్
అద్దెకు మిలటరీ అవసరం లేదు- మాన్
21 ఏళ్లకే మాజీ సైనికులుగా ఎలా తయారు చేయగలం? -మాన్
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి- సీఎం మాన్
అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు
రేపు భారత్ బంద్ కు బీహార్ యువకుల పిలుపు
భారత్ బంద్ కు బీహార్ విపక్ష పార్టీల మద్దతు
నిరసనకారులతో రైల్వే అధికారుల చర్చలు విఫలం
10 మందినే చర్చలకు రావాలన్న అధికారులు
నిరాకరించిన నిరసనకారులు... ఆందోళన కొనసాగింపు
కాల్పులు ఎందుకు జరిపారో చెప్పాలంటున్న నిరసనకారులు
సికింద్రాబాద్ అల్లర్లపై ఇంటెలిజెన్స్ ఆరా
విధ్వంసం చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్
సికింద్రాబాద్ నిరసనలు, కాల్పుల ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమన్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్ కల్యాణ్. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించిన రైల్వే ఉన్నతాధికారులు
కేవలం 10 మంది మాత్రమే చర్చలకు రావాలని ఆహ్వానం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ
హైదరాబాద్ హింసాత్మక ఘటనలపై అమిత్ షాకు వివరించిన కిషన్ రెడ్డి
Agnipath విషయంలో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు
సికింద్రాబాద్ హింస వెనక కొన్ని శక్తులు ఉన్నాయి
కుట్ర కోణం ఉంది.. రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఉంది
ఇంత పెద్ద ఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది
గత కొన్ని సవత్సరాలుగా ఈలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు
ఘటన జరిగిన మూడు గంటలు అయినా పోలీసులు స్పాట్ కి పోలేదు
లా అండ్ ఆర్డర్ చూస్కునే బాధ్యతా రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్ర మంత్రి కేటీఆర్ రెచ్చ గొట్టేలా మాట్లాడుతున్నారు
సికింద్రాబాద్ విధ్వంసకాండపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం.
రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరి మృతి చెందడం, పలువరు గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా.
మొన్న కిసాన్ ను నేడు జవాన్ ను రోడ్డు మీద పడేసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కుతుంది.
దేశ రక్షణను బీజేపీ గాలికి వదిలేసి బేరాలాడుతూ ఖర్చుకు వెనుకాడుతున్నది. దేశ రక్షణ కోసం తమ సేవలు అందించాలనుకునే ఆసక్తి గల దేశ యువతను బీజేపీ ఘోరంగా అవమానిస్తోంది
'అగ్నిపథ్' అనాలోచిత చర్య... యువత శాంతియుత నిరసనల ద్వారా తమ హక్కులు సాధించుకోవాలి-టీఆర్ఎస్
సికింద్రాబాద్ విధ్వంసకాండలో మృతుడి వివరాలు :
దామోదర రాకేష్ (18), S/o కుమారస్వామి, డబీర్పెల్ గ్రామం. వరంగల్ జిల్లా
గాయపడ్డవారి వివరాలు
జగన్నాథ రంగస్వామి (20) మంత్రాలయం, కర్నూలు జిల్లా.
కె.రాకేష్ (20) S/o మల్లయ్య, చింతకుంట గ్రామం, కరీంనగర్ జిల్లా
జే.శ్రీకాంత్ (20), S/o తిరుమలయ్య, పాలకొండ గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా
ఏ.కుమార్ (21), S/o శంకర్, వరంగల్ జిల్లా.
పరశురాం (22), S/O శంకర్, నిజాం సాగర్-కామారెడ్డి జిల్లా.
మోహన్ (20), S/o నాగయ్య, నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా
నాగేందర్ బాబు (21, ఖమ్మం
'అగ్నిపథ్' స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల వెనుక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కుట్ర ఉందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
అగ్నిపథ్' స్కీమ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన, హింసాత్మక సంఘటనలకు దారితీసిన వైనం వెనుక ముందస్తు స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆర్మీ ఔత్సాహిక అభ్యర్థులంతా దీనిపై వాట్సాప్ గ్రూపుల్లో సందేశాల్లో పంపించుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గురువారం (జూన్ 17) రాత్రే పెద్ద ఎత్తున యువత హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9గం. సమయంలో అంతా ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోపలికి దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసకాండ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెట్రో రైలు సర్వీసులు కూడా రద్దు...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం నేపథ్యంలో 6 రైళ్లు రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు...
నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు.
ప్రయాణికులెవరూ రావద్దని పోలీసుల విజ్ఞప్తి
వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లు వరంగల్ స్టేషన్‌లో నిలిపివేత
కాజిపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలో భద్రత పెంపు.
నిఘా నీడలో పాతబస్తీ చార్మినార్ పరిసరప్రాంతాలు... భారీగా మోహరించిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంపై జీ తెలుగు న్యూస్ లైవ్ ప్రసారం..
అగ్నిపథ్ స్కీమ్‌ను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న విద్యార్థులు... ఇతర రైల్వే స్టేషన్లకు కూడా ఆందోళనలు విస్తరిస్తాయని హెచ్చరిక..
రైల్వే స్టేషన్‌లో విధ్వంసకాండతో చాలామంది రైల్వే ప్రయాణికులు తమ లగేజీని రైళ్లలోనే వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు.
ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌ను వీడకపోతే పోలీసులు మరోసారి కాల్పులు జరిపే ఛాన్స్..?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్స్, పట్టాల పైనే ఇంకా వందలాది మంది ఆందోళనకారులు... స్టేషన్ వద్దకు మరింత పోలీస్ ఫోర్స్
పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. ధ్రువీకరించిన గాంధీ వైద్యులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. యువకుడి మృతిని గాంధీ వైద్యులు నిర్ధారించారు.
రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన దాదాపు 2 వేల మంది విద్యార్థులు... పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆందోళనకారులను అడ్డుకోలేకపోయారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇప్పటికీ ఉద్రిక్తత... కొనసాగుతున్న ఆందోళనలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక ఘటనలపై రైల్వే జీఎం ఎమర్జెన్సీ మీటింగ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 1,2,3లలో ఎక్కువ విధ్వంసం
పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నిరసనకారులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంతో 44 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
రైలుకు నిప్పంటించిన నిరసనకారులు.. మంటలార్పుతున్న రైల్వే పోలీస్, ఫైరింజన్ సిబ్బంది...
రూ.20 కోట్లు ఆస్తి నష్టం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
రైళ్లు, షాపులకు నిప్పు :
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 3 రైళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. శాలిమర్ హైదరాబాద్, ఈస్ట్ కోస్ట్ రైళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న షాపులకు కూడా నిప్పు పెట్టారు. హింసాత్మక సంఘటనలతో రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఎన్‌ఎస్‌యూఐకి సంబంధం లేదు : బల్మూరి వెంకట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక సంఘటనలకు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐకి ఎటువంటి సంబంధం లేదని ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు.