Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?

Agnipath Riots:  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు జరిగాయని భావిస్తున్న పోలీసులు.. ఆదిశగానే కీలక ఆధారాలు సేకరించారు.

Written by - Srisailam | Last Updated : Jun 18, 2022, 12:42 PM IST
  • సికింద్రాబాద్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు
  • ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్ల సహకారంతోనే విధ్వంసం
  • అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?
Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?

Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు జరిగాయని భావిస్తున్న పోలీసులు.. ఆదిశగానే కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంస ఘటనలకు కీలక సూత్రధారిగా గుర్తించిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్నారు సుబ్బారావు. అల్లర్లలో సుబ్బారావు పాత్రకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించడంతో అతన్ని ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సుబ్బారావును గుంటూరు జిల్లా పోలీసులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.

ఆర్మీ అభ్యర్థులతో ఆవుల సుబ్బారావు దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ ఆందోళనకు మద్దతు తెలిపేందుకు సుబ్బారావు వచ్చారు.. మిగితా అకాడమీల డైరెక్టర్లు కూడా వస్తారంటూ అభ్యర్థులు చాట్ చేసుకున్న విషయాలు బయటికి వచ్చాయి.దీంతో సుబ్బారావు డైరెక్షన్ లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారని తెలుస్తోంది. సికింద్రాబాద్ విధ్వంసఘటన కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోనికి తీసుకున్నారు. విధ్వంస ఘటనలో 12 మంది కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పినట్లు  పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ లతో పాటు ఆడియా కాల్స్ కూడా బయటికి వచ్చాయి. హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బ్లాక్స్‌, 17/6 గ్రూపులు కీలకంగా ఉన్నాయని తెలుస్తోంది. కరీంనగర్‌ స్టార్‌ డిఫెన్స్‌ అకాడమీ ఓనర్ వసీంపైనా  రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్ల సహకారంతోనే అభ్యర్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాల నుంచి ముందు రోజే వచ్చిన కొందరు అభ్యర్థులకు అకాడమీల్లోనే షల్టర్ ఇచ్చినట్లు తేల్చారు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే నిరసనకారులు రైల్వేస్టేషన్ కి వచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు వాటర్ బాటిల్ లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వహకులే అందించారని తెలుస్తోంది. ఆర్మీ రాత పరీక్ష రద్దు అయిందని మూడు రోజుల క్రితం యూట్యూబ్ లో వీడియోలు వచ్చాయి. ఆ తర్వాతే ఈ కుట్రకు ప్లాన్ జరిగిందని తెలుస్తోంది.

Read also: Agnipath Riots:వరంగల్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత

Read also: KCR SHOCK: టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News