Bandi Sanjay Arrest Live Updates: బండి సంజయ్‌కు రిమాండ్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Wed, 05 Apr 2023-9:16 pm,

Bandi Sanjay Arrest Live Updates: తెలంగాణ రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

Bandi Sanjay Arrest Live Updates: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. తెలంగాణలో వరుస పేపర్ లీకులు సంచలనం రేకెత్తిస్తున్న తరుణంలో బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. పేపర్ల లీక్‌పై నేడు ప్రెస్‌మీట్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ కోరగా.. ఏ ఇష్యూ లేకపోయినా అదుపులోకి తీసుకునే అధికారం ఉందంటూ పోలీసులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారు. 
 

Latest Updates

  • Bandi Sanjay Bail Plea: బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. అయితే, బండి సంజయ్‌కి బెయిల్ లభిస్తే ఆయన సాక్షులను, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బండి సంజయ్‌కి బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు.

  • బండి సంజయ్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్‌పై కోర్టు నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 19వ వరకు న్యాయవాది రిమాండ్ విధించారు. 
     

  • బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. ఇరు వైపులా వాదనలు విన్న తరువాత 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. బండి సంజయ్‌ను ఖమ్మం జైలుకు తరలించే అవకాశం ఉంది.

  • తన ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్లు తనకు సమాచారం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిన్న ఉదయం నుంచి తన ఫోన్‌ను చూడలేదని చెప్పారు. బండి సంజయ్‌ కంటే ముందు ఈటలకే ప్రశ్నాపత్రం వెళ్లిందని సీపీ రంగనాథ్‌ చెప్పిన ఆరోపణల నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

  • బండి సంజయ్‌కు 14 రోజులు రిమాండ్ విధించాలని ప్రభుత్వ లాయర్లు మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు. అసలు అరెస్టే అక్రమమని బండి సంజయ్ లాయర్లు వాదించారు. మెజిస్ట్రేట్ మరికాసేపట్లో తీర్పు వెల్లడించనున్నారు.

  • బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తారా..? రిమాండ్ విధిస్తారా..? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఎ కేసీఆర్ సీరియస్ అయ్యారు. మరికాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. బండి సంజయ్‌ తీరును ఎండగట్టే అవకాశం ఉంది.

  • మెజిస్ట్రేట్ ముందు ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో జడ్డి తీర్పును వెల్లడించనున్నారు.
     

  • మెజిస్ట్రేట్ ముందు బండి సంజయ్ పిటిషన్‌ను దాఖలు చేశారు పోలీసులు. అరెస్ట్ అక్రమమంటూ బండి సంజయ్ లాయర్లు వాదిస్తున్నారు. లీగల్ టీమ్‌తో బండి సంజయ్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు లాయర్లు.

  • ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందుకు బండి సంజయ్‌ను పోలీసులు తీసుకువచ్చారు. హనుమకొండ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అభివాదం చేస్తూ బండి సంజయ్ లోపలకు వెళ్లారు. 

  • ==> బండి సంజయ్‌ కంటే ముందు ఈటలకు పేపర్ పంపించారు-సీపీ రంగనాథ్‌
    ==> కుట్ర ఉంటే బండి సంజయ్‌నే ఎందుకు అరెస్ట్ చేస్తాం..?
    ==> మిగతా బీజేపీ నాయకులపై మేం ఎందుకు కేసులు పెట్టలేదు

  • ==> బండి సంజయ్‌ ఫోన్‌ పేపర్ లీకేజీపై మరింత సమాచారం ఉంటుంది-సీపీ రంగనాథ్‌
    ==> బండి సంజయ్ డైరెక్షన్‌లోనే లీకేజీ అంతా జరిగింది
    ==> పరీక్షలను రద్దు చేయించాలనే దురద్దేశం కనిపిస్తోంది
    ==> చాట్స్‌, కాల్ డేటా వస్తే చాలా విషయాలు తెలుస్తాయి 
    ==> బండి సంజయ్‌ ఫోన్‌ను ఎందుకు దాస్తున్నారు..?
    ==> నిర్దోషి అయితే ఫోన్ దాయాల్సిన అవసరం ఏంటి..?

  • ==> పేపర్ లీక్ కంటే ముందు రోజే బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారు-సీపీ రంగనాథ్‌
    ==> ఈ చాట్ ఆధారంగానే బండి సంజయ్‌ను ఏ1గా నమోదు చేశాం..
    ==> బండి సంజయ్ దురుద్దేశంతోనే చేసినట్లు నిర్ధారణ అయింది..
    ==> మొదటి రోజు తెలుగు బిట్ పేపర్ కూడా బయటకు వచ్చింది

  • ==> ప్రశాంత్, మహేష్ చాలా మందికి ప్రశ్నాపత్రాన్ని పంపించారు-సీపీ రంగనాథ్‌
    ==> ఈటల రాజేందర్‌తోపాటు ఆయనకు పీఏలకు పంపారు.
    ==> పేపర్ లీకేజీ అంతా ఓ గేమ్‌ప్లాన్‌లా చేస్తున్నారు
    ==> పేపర్లను ఓ ప్లాన్‌ ప్రకారమే షేర్ చేస్తున్నారు

  • ==> బండి సంజయ్ ఫోన్ ఇచ్చి ఉంటే చాలా విషయాలు తెలిసేవి-సీపీ రంగనాథ్‌
    ==> సెక్షన్ 41 ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు.
    ==> బండి సంజయ్‌కు 11:24కు ప్రశ్నాపత్రం చేరింది
    ==> వాట్సాప్‌ కాల్‌లో బండి సంజయ్‌తో ప్రశాంతో మాట్లాడారు
    ==>షేర్ చేశారన్న కారణంతోనే ఎవరిని అదుపులోకి తీసుకోలేదు

  • ==> రిమాండ్ రిపోర్ట్‌లో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చాం-సీపీ రంగనాథ్‌ 
    ==> ప్రశాంత్, బండి సంజయ్ మధ్య ఫోన్ కాల్స్ నడిచాయి
    ==> ఫోన్ అడిగితే బండి సంజయ్ లేదని చెప్పారు
    ==> బూర ప్రశాంత్‌ను నిన్ననే అరెస్ట్ చేశాం..
    ==> ప్రశాంత్ చాలా మందికి పేపర్‌ను ఫార్వర్డ్ చేశాడు
    ==> ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకే కుట్ర పన్నారు-సీపీ రంగనాథ్‌

  • బండి సంజయ్‌ అరెస్ట్‌పై వరంగల్ సీపీ రంగనాథ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తున్నారు.
     

  • బండి సంజయ్ అరెస్ట్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హిందీ పరీక్ష మొదలైన దగ్గర నుంచి పేపర్ ఎలా బయటకు వచ్చింది..? ఎవరెవరికి షేర్ అయింది..? అనే విషయాలను పొందుపరిచారు.
     

  • టెన్త్ పేపర్ లీక్‌ కేసులో బండి సంజయ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేష్, ఏ4 మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్‌ పేర్లను రిమాండ్ రిపోర్టులో ఉన్నాయి. 120 (బి), 477, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

  • మరోవైపు బీజేపీ కార్యకర్తలు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో హన్మకొండ కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
     

  • హన్మకొండ కోర్టు బయట బండి సంజయ్‌కు నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ వస్తున్న వెహికల్‌పై చెప్పులు, గుడ్లు విసిరారు. 
     

  • హన్మకొండ జిల్లా కోర్టుకు బండి సంజయ్‌ను తీసుకువచ్చారు పోలీసులు. కోర్టు వెనుక గేటు నుంచి లోపలకు తీసుకెళ్లారు. పోలీసు వలయంలో హన్మకొండ కోర్టు ఉంది. హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ముందు పరిచారు.

  • తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు భోజనం చేసేందుకు కూడా నిరాకరించినట్లు తెలుస్తోంది.

  • కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు బండి సంజయ్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు. మడికొండ పోలీస్ ట్రైనింగ్‌ సెంటర్‌ను బండి సంజయ్‌ను తీసుకెళ్లారు. హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బండి సంజయ్ తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయవాదులు సిద్ధమయ్యారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • బండి సంజయ్ కుమార్‌పై టెన్త్ క్లాస్ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. కనుకుంట్ల విష్ణుచరణ్ అనే పదో తరగతి విద్యార్ధి గోదావరిఖని వన్ టౌన్‌లో పోలీసులను ఆశ్రయించాడు. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడుతున్న బండి సంజయ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తమ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న వారికి కఠిన శిక్ష వేయాలని ఫిర్యాదు చేశాడు. 

  • బండి సంజయ్ కుమార్‌పై టెన్త్ క్లాస్ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. కనుకుంట్ల విష్ణుచరణ్ అనే పదో తరగతి విద్యార్ధి గోదావరిఖని వన్ టౌన్‌లో పోలీసులను ఆశ్రయించాడు. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడుతున్న బండి సంజయ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తమ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న వారికి కఠిన శిక్ష వేయాలని ఫిర్యాదు చేశాడు. 

  • 'టెన్త్ పేపర్ వరుసగా లీక్ అవుతున్నప్పుడే కుట్ర ఉందని అనుమానం వచ్చింది.. ప్రశాంత్  బండి సంజయ్ తో వందల సార్లు ఎందుకు ఫోన్ మాట్లాడాల్సివచ్చింది.. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలి.. అన్ని పేపర్ లీక్ కేసులను సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.. పేపర్ లీక్ కేసు లో బీజేపీ హస్తం ఉందని అనిపిస్తుంది.. ఏ తప్పు చేయలేదని బండి సంజయ్ నిరూపించుకోవాలి..' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

  • బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. 
     

  • బాగోతం బయటపడింది: మంత్రి కొప్పుల

    బండి సంజయ్ అరెస్ట్‌తో బాగోతం బయట పడిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం చేసిన కుట్రలో భాగమే ఈ లీకేజీల వ్యవహారమన్నారు. పథకం ప్రకారమే పేపర్ బయటకు వచ్చిందని.. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసుల వెనక ఉన్న ఎంత పెద్దవాళ్లు ఉన్న అందరిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని స్పష్టం చేశారు.

  • వరంగల్ సీపీ ప్రెస్‌మీట్ తరువాత బండి సంజయ్‌ను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జఫర్‌గఢ్‌ దగ్గర పోలీస్ కస్టడీలో ఆయన ఉన్నారు. 
     

  • బండి సంజయ్‌ అరెస్ట్‌పై సాయంత్రం నాలుగు గంటలకు సీపీ రంగనాథ్‌ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. బండి సంజయ్ పాత్రపై ఆధారాలు చూపించే అవకాశం ఉంది. బండికి ప్రశాంత్ ఎన్నిసార్లు ఫోన్ చేశాడన్నదానిపై సీపీ వివరణ ఇవ్వనున్నారు.
     

  • 'హిందీ పేపర్ లీకేజీ పేరు చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న. ఇదంతా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చెయ్యడానికే. బీజేపీ ప్రజల పక్షాన ఉంది.  కేసీఆర్ నీ రాజ్యం, ప్రభుత్వం శాశ్వతం కాదు. కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. TSPSC ని రద్దు చేయాలి. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపండి. దేశం అంతా డబ్బులు ఖర్చు పెడతా అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంతగా తెలంగాణ ప్రజలను కొల్లగొట్టారు అర్థం చేసుకోండి. లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని మీరే నిరూపించుకోవాలి. .' ఈటల రాజేందర్ అన్నారు.

  • బండి సంజయ్ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. హోమ్‌ శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం కోర్టు విచారణ చేపట్టనుంది.
     

  • మంత్రి కేటీఆర్ ట్వీట్
     

  • బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందని మంత్రి హారీష్‌ రావు విమర్శించారు. బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడిందని.. బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్ర దారు అని ఆరోపించారు.

  • బండి సంజయ్‌పై ఐపీసీ 420, 120B, సెక్షన్ 5 ప్రివెన్షన్‌ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్, సీఆర్పీఎస్‌ 154 ,157 సెక్షన్ల కింద మొత్తం రెండు చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. కరీంనగర్‌ 2 టౌన్, కమలాపూర్‌లో కేసులు నమోదు చేసి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు.

  • బండి సంజయ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు పొందుపరిచారు. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌తో కొంతకాలంగా ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్‌లో సమాచారం వైరల్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.
     

  • బండి సంజయ్‌ను పోలీసులు పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link