Congress Telangana Key Lok Sabha Seats Candidates:  కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లో 14 ప్రకటించి చాలా రోజులు అవుతోంది. అటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై నిన్నటి వరకు ప్రకటించకుండా సస్పెన్స్ మెయింటేన్ చేసింది. ఇక నామినేషన్లకు ఈ రోజు లాస్ట్ డేట్  కావడంతో కాంగ్రెస్ హై కమాండ్.. ఖమ్మం, కరీంగనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను ఎట్టకేలకు ప్రకటించింది. నిన్నటి వరకు ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియంకా వాద్రా పోటీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఖమ్మం లోక్ సభ సీటును కాంగ్రెస్ అధిష్ఠానం రఘురామిరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. ఈయన ప్రముఖ నటుడు వెంకటేష్‌తో పాటు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వయాన వియ్యాంకుడు అవుతాడు. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహాం.. రఘురామిరెడ్డి పెద్ద కుమారుడుతో జరిగింది. అటు చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహాం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్నిని రెడ్డితో జరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే సీట్లలో  ఖమ్మం లోక్‌సభ స్థానం ఉంది. అందుకే ఈ సీటుపై ముందు నుంచి భారీ పోటీ నెలకొంది.  ఈ సెగ్మెంట్‌లో ఎంపీ కోసం తుమ్మల, భట్టి, పొంగులేటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ కేటాయించింది. భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, మరోవైపు తుమ్మల నాగేశ్వరావు తన కుమారుడు యుగంధర్‌ను బరిలో దింపాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు. మొత్తంగా ఖమ్మం ఎంపీ టికెట్ పై  కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ బదులు.. ఆయన వియ్యంకుడు రఘురాం రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది.
 
రఘురాం రెడ్డి విషయానికొస్తే..


ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి తనయుడిగా రఘురాం రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించారు. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా పాలేరు. నియోజకవర్గం జేగొమ్మ గ్రామం. సురేందర్ రెడ్డి గతంలో మహబూబా బాద్, వరంగల్ లోక్ సభ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు. అటు ఉమ్మడి వరంగల్‌లోని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. రఘురాం రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా .. వరంగల్ లోక్ సభ సీటు ఇంఛార్జ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రెజెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. హైదరాబాద్ రేస్ కోర్స్ క్లబ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.



ఇక కరీంనగర్ స్థానంలో మజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు వినిపించింది. చివరకు ఈ టికెట్ వెలిచాలా రాజేందర్ రావుకు కేటాయించారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ వలీవుల్లా సమీర్ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. మొత్తంగా నామినేషన్లకు ఈ రోజు లాస్ట్ కావడంతో అభ్యర్ధులందరు ఈ రోజు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది.  రేపు (ఏప్రిల్ 26వ) తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా ఉంది.  మే 13వ తేదీన తెలంగాణ, ఏపీలో నాల్గో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. జూన్ 4న అన్ని లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు.


Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook