Lok Sabha Elections 2024: కంటోన్మెంట్ ఉపఎన్నిక బరిలో ఉంటా.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత..
Telangana cantonment Bypoll: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని భాగంగా తెలంగాణలోని కంటోన్మెంట్ పరిధిలో ఏర్పడిన ఖాళీకి కూడా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈక్రమంలో తాజాగా, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
General Elections And Telangana Contonment ByPoll 2024: దేశంలో 18వ లోక్‌సభకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్లమంది ఓటర్లు ఓటేసేందుకు సిద్గంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. నాలుగో ఫేజ్ లో మే 13న కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరగనుంది.
ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉంటానని దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి నివేదిక ప్రకటించారు. అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించారు. తన తండ్రి దివంగత నేత సాయన్న, సోదరి లాస్య నందితలను ఆదరించి గెలిపించినట్లు తనకు కూడా ప్రజలు పట్టంకట్టాలని ఆమె కోరారు. తన తండ్రిని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత మా అక్కను కూడా ఆదరించారని ఆమె గుర్తు చేశారు .
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
ఈ విషయంపై తొందరలోనే బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ తో కలసి మాట్లాడతానని చెప్పారు. కాగా, ఫిబ్రవరి 28 న హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మరణించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే.. కంటోన్మెంట్ కు ఖాళీ ఏర్పడింది. దీనికి ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈక్రమంలో కంటోన్మెంట్ ప్రజలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. దీనిపై గులాబీ బాస్ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook