Nagar Kurnool Loksabha: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధి స్థానాలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కావడంతో రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ప్రతిపక్ష నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నాగర్‌ కర్నూలు, మహబూబ్‌నగర్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లు రవికి టికెట్‌ కేటాయించారు. మహబూబ్‌నగర్‌ నుంచి వంశీ చందర్‌రెడ్డిని పోటీలో నిలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి. కాగా ఆయనకు నాగర్‌ కర్నూలు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేల స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. దీంతో  కాంగ్రెస్‌ భారీ మెజారిటితో గెలుస్తోందిని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
బీజేపీ కూడా నాగర్‌ కర్నూల్‌ స్థానంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. దీనిలో భాగంగానే ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మోడీ రాకతో బీజేపీ నేతలు పుల్‌ జోష్‌లో ఉన్నారు. మోదీ పర్యటన బీజేపీకి కలిసివస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా ఈ స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన సిట్టింగ్‌ ఎంపీ అయిన రాములు కుమారుడు భరత్‌కు బీజేపీ టికెట్‌ కేటాయించింది. రాములు రాజకీయాల్లో సీనియర్ నాయకులు.. తన సిట్టింగ్‌ స్థానంలో కుమారుడిని గెలిపించి.. నాగర్‌ కర్నూల్‌లో  తన పట్టును నిలబెట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. నాగర్‌ కర్నూల్‌ స్థానాన్ని కమలం పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.


మరోపక్కా బీఆర్ఎస్‌ కూడా ఇక్కడ గెలిచి తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నాగర్‌ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి పోటీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు కలిసివస్తోందని.. ఆయనకు బహుజనుల మద్దతు ఉంటుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ప్రవీణ్‌కుమార్‌ లోకల్‌ కావడం.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసిన నాయకులు, బహుజన సంఘాల మద్దతుతో గెలుపు పక్కా అని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.


Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter