Accident on ORR : ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జిపై నుంచి కిందున్న రోడ్డుపై పడిన లారీ
నగర శివార్లలోని శామీర్‌పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి మీద నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కింద ఉన్న రోడ్డుపై పడింది. సిమెంట్ బస్తాల లోడుతో కీసర నుంచి బయల్దేరిన లారీ మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : నగర శివార్లలోని శామీర్‌పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి మీద నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కింద ఉన్న రోడ్డుపై పడింది. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన క్లీనర్‌ని చికిత్స నిమిత్తం అల్వాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. సిమెంట్ బస్తాల లోడుతో కీసర నుంచి బయల్దేరిన లారీ మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన తీరు చూస్తోంటే.. డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే లారీ అదుపుతప్పి ఇలా బ్రిడ్జిపై నుంచి రెండు రోడ్ల మధ్య ఉన్న గ్యాప్‌లోంచి కింద పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కింద ఉన్న రోడ్డుపై లారీ అడ్డంగా పడటంతో అటువైపుగా రాకపోకలు సాగించే వాహనాలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. దీంతో సహాయ కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు.. క్రేన్ల సహాయంతో లోడును రోడ్డుపై నుంచి తొలగించి లారీని పక్కకు జరిపే పనిలో నిమగ్నమయ్యారు.