Lovers suicide | వికారాబాద్: జిల్లాలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ శివార్లలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి, యువకుడు ఇద్దరూ ఎవరనేది ఇంకా తెలియకపోవడంతో గుర్తు తెలియని ప్రేమ జంట ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ జంట ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..