Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకు
Luxury Villas Drowned Into Heavy Floods In Mokila: వరద సామాన్యులనే కాదు కోటీశ్వర్లను కూడా రోడ్డు పాలు చేసింది. విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటే వారికి వరద పోటు తలెత్తింది.
Villas Drowned In Water: తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. చుట్టూ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలే కాకుండా హైదరాబాద్ కూడా వరదలకు ప్రభావితమైంది. సామాన్యులే కాదు కోటీశ్వర్లు కూడా వరద బాధితులుగా మారారు. ఖరీదైన.. విలాసవంతమైన విల్లాల్లోకి కూడా వరద ముంచెత్తడంతో కోటీశ్వర్లు కూడా ప్రకృతి ప్రకోపానికి గురయ్యారు. హైదరాబాద్ శివారులోని విల్లాలు నీటిలో మునిగిపోయాయి. వాళ్లు కూడా సహాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది.
Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్
ఎడతెరపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో భారీగా వరద చేరుకుంది. శంకర్‌పల్లి మండలం మోకీల పరిధిలో లా పలోమా విల్లాస్ (La Paloma Villas)లోకి వరద నీరు పోటెత్తింది. సుమారు 200 విల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా విల్లాల పక్కన ఉన్న వాగు పొంగి ప్రవహించింది. ఫలితంగా వరద నీరు విల్లాల్లోకి చేరింది.
Also Read: AP Floods: విజయవాడ వరదలపై ఏం చేయలేం! భారమంతా దేవుడిపైనే..
విల్లాల లోపలికి కూడా నీరు చేరింది. దీంతో ఖరీదైన సోఫా సెట్లు, ఇంటి సామగ్రి తడిసిపోయాయి. అంతేకాకుండా విలాసవంతమైన కార్లు కూడా నీట మునిగాయి. దీంతో ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి విల్లావాసులు విస్తుపోయారు. విల్లావాసులంతా ఇళ్లలోంచి బయటకు వచ్చి పరిస్థితిని చూసి నోరెళ్లబెట్టారు. తమ కార్లు నీటితో నిండడం చూసి లబోదిబోమన్నారు.
కాలువల కబ్జా?
విల్లాలకు ఈ దుస్థితి రావడంపై కారణాలు తెలుసుకుంటున్నారు. అయితే వరద కాలువలు కబ్జా చేయడం వలనే వరద పోటెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలా ప్రవాహానికి అడ్డుగా విల్లా నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో విల్లాల్లోకి వరద రావడం సర్వ సాధారణమని వాపోతున్నారు. మరి హైడ్రా వీటిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter