First woman SHO for law and order police station in Hyderabad: 174 ఏళ్ల హైదరాబాద్‌ నగర పోలీస్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతల ఠాణాకు తొలి ఇన్‌స్పెక్టర్‌గా ఓ మహిళ నియమితులయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) నాడు లాలాగూడ ఠాణాలో మధులత ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ.. ఆమెకు సెల్యూట్‌ చేసి గౌరవం చాటారు. మహిళా దినోత్సవం 2022 సందర్భంగా ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.  2002 బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారే మధులత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, సీపీ కొత్వాల్‌ ఆనంద్‌ సమక్షంలో లాలాగూడా ఎస్‌హెచ్‌ఓగా మధులత బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది, అధికారిణిల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తెలంగాణ వచ్చాక పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ వచ్చింది. దీంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అదనపు డీజీ నుంచి కానిస్టేబుళ్ల వరకు ప్రస్తుతం 3803 మంది ఉన్నారు. వారితో పాటుహోంగార్డులు అదనంగా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో ఉన్న వారి సంఖ్య 31గా ఉంది. అయితే వీరిలో ఏ ఒక్కరూ శాంతిభద్రతల విభాగం ఠాణాకు ఎస్‌హెచ్‌ఓగా లేరు. 


ఇంతవరకు ట్రాఫిక్‌, సీసీఎస్‌, మహిళా పోలీస్‌ స్టేషన్లలోనే మహిళా ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తుండగా.. తొలిసారి శాంతిభద్రతల ఠాణాకు మహిళను నియమించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ, కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆమెను అభినందించారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బాగా పనిచేసి పేరు తెచ్చుకోవాలని సూచించారు. శాంతిభద్రతల ఠాణాకు తొలిసారిగా మహిళా ఇన్‌స్పెక్టర్‌గా నియమించినందుకు ఆనందంగా ఉందని సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. భవిష్యత్తులో కమిషనరేట్‌లోని 63 శాంతిభద్రతల పోలీస్‌ ఠాణాల్లోనూ మహిళా అధికారులు పనిచేసేలా పోటీ పెరగాలని ఆకాంక్షించారు. 


మధులత 2002 బ్యాచ్ కు చెందిన మహిళా సర్కిల్ ఇన్ స్పెక్టర్. సౌత్ జోన్ పాతబస్తీ ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐగా, ఎస్ బి వింగ్ సీఐగా సమర్ధంగా విధులు నిర్వహించారు. ఆమెపై నమ్మకంతో సిటీ పోలీస్ బాస్ సీవీ ఆనంద్ మంగళవారం వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మహిళా సీఐ పేరు సీల్డ్ కవర్‌లో సర్ప్రైజ్‌గా ఉంచారు సీవీ ఆనంద్. హోంమంత్రి మహమూద్ అలీ, సీపీ ఆనంద్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే ఆమె పేరు అధికారికంగా ప్రకటించారు. తనకు దక్కిన అరుదైన అవకాశంపై మధులత ఆనందం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రోత్సాహం, పోలీసు అధికారిగా ఉన్న భర్త సహకారంతో ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు.


Also Read: Coal Mine Accident: సింగరేణిలో విషాదం.. అడ్రియాల్‌ గనిలో రూప్ వాల్ కూలి ముగ్గురు మృతి!!


Also Read: Horoscope Today March 9 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook