Nalgonda Police Inhumanity: నల్గొండ జిల్లా పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఒకటి వెలుగుచూసింది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఓ పోలీస్ అధికారి వాహనం ఓవర్‌స్పీడ్‌తో ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని కారు డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో లేదా తమ వాహనం వెనుక సీట్లో పడుకోబెట్టి తరలించే అవకాశం ఉన్నా పోలీసులు అతన్ని డిక్కీలో తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు మునుగోడు వెళ్తుండగా.. బైక్‌పై చండూరు వైపు వెళ్తున్న సంగిశెట్టి ధనుంజయ (65)ను డీఎస్పీ ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టింది. బోడంగిపర్తి శివారులోని ఓ మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డీఎస్పీ వాహనం అతివేగంతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ధనుంజయ బైక్‌ పైనుంచి ఎగిరి కిందపడ్డాడు. ప్రమాదంలో ధనుంజయకు తీవ్ర గాయాలయ్యాయి.


ఈ ప్రమాదం జరిగిన వెంటనే డీఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మిగతా పోలీసులు బాధితుడిని పోలీస్ వాహనంలో 25 కి.మీ దూరంలోని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అంత దూరం అతన్ని కారు డిక్కీలో తరలించడం గమనార్హం. అంబులెన్స్‌లో తరలించడమో లేక పోలీస్ వాహనంలోనే వెనుక సీట్లో పడుకోబెట్టి తరలించడమో చేయకుండా.. రక్తమోడుతున్న వ్యక్తిని డిక్కీలో తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాయపడిన ధనుంజయ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 


Also Read: Planes Collision: ఘోర విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. పలువురు మృతి..


Also Read: Horoscope Today August 19th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారిని నిరాశ, నిస్తేజం అలుముకుంటుంది..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook