Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..
Mohan babu controversy: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన ఈ రోజ్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించినట్లు తెలుస్తొంది.
Big relief for mohan babu in Telangana high court: మంచు ఇంట వివాదం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న మంచు మోహన్ బాబు నివాసమైన జల్ పల్లిలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా.. దీనిపై పెద్ద రచ్చ జరిగిందని చెప్పుకొచ్చు. మంచు మోహన్ తన బౌన్సర్ లో గేట్లు పగలకొట్టి లోపలికి ప్రవేశించడం.. అక్కడ మంచు విష్ణు బౌన్సర్ లు.. మనోజ్ పై దాడులు చేసినట్లు తెలుస్తొంది.
దీంతో అక్కడకు వచ్చిన మోహన్ బాబు కంట్రోల్ తప్పి ఒక మీడియా రిపోర్టర్ పై ఇష్టమున్నట్లు దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అతను విధినిర్వహణలో.. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలుస్తొంది. మోహన్ బాబు దాడిని మాత్రం అన్ని పాత్రీకేయ సంఘాలు ఖండించాయి. మరొవైపు అతనికి తలకు ఫాక్చర్ అయినట్లు కూడా తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మోహన్ బాబు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా.. గాయపడ్డ రిపోర్టర్ ను ఆస్పత్రికి తరలించారు. మోహన్ బాబు కు బీపీ అబ్ నార్మల్ కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సీపీ.. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసి.. తమఎదుట హజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మోహన్ బాబుపై కేసును కూడా నమోదు చేశారు. కానీ మోహన్ బాబు ప్రస్తుతం కాంటీనెంటల్ ఆస్సత్రిలో ఉన్నట్లు తెలుస్తొంది.
మరొవైపు మంచు విష్ణు సీపీఎదుట హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో మోహన్ బాబు.. తరపున లాయర్ లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీన్నివిచారించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు మాత్రం.. బిగ్ రిలీఫ్ ఇచ్చిందని తెలుస్తొంది. పోలీసుల ఎదుట మోహన్ బాబు హజరు నుంచి మినహయింపు ఇచ్చినట్లు తెలుస్తొంది. పిటిషనర్ తరపు రిక్వెస్ట్ తో కొర్టు ఏకీభవించినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో హైకోర్టు తదుపరి విచారణను.. ఈ నెల 24కు వాయిదా వేసినట్లు తెలుస్తొంది. మరోవైపు మంచు మనోజ్ ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పడం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం... మంచు మోహన్, విష్ణు పోలీసుల ఎదుట హజరు కావడం నుంచి కోర్టు మినహయింపు ఇచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కోర్టు.. పోలీసులు వీరి ఇంటికి పరిశీలించాలని చెప్పినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.