Manipur Landslide Tragedy: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లా తులుం రైల్వే స్టేషన్‌ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు జవాన్లు ఉన్నారు. 107 టెరిటోరియల్ ఆర్మీ క్యాంపుపై కొండచరియలు పడటంతో జవాన్లు మృతి చెందారు. దాదాపు 50 మంది వరకు శిథిలాల  కింద చిక్కుకుపోయారు. వీరిలో కొందరిని సురక్షితంగా వెలికితీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకూ 14 మృతదేహాలను వెలికితీసినట్లు డీజీపీ పీ డౌంగెల్ తెలిపారు. శిథిలాల కింద మొత్తం ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదన్నారు. స్థానిక పోలీసులు, అస్సాం రైఫిల్స్ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు.గురువారం (జూన్ 30) తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా.. అప్పటినుంచి నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మణిపూర్‌కు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అక్కడి ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.




Also Read: POWER SHOCK: ఉడుత వల్లే ఐదుగురిని కరెంట్ కాటేసిందట! పుట్టపర్తి ప్రమాదంపై జగన్ సర్కార్ వాదన..


Also Read: TS TET  Results 2022: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల.. అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook